
‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) చిత్రానికి ముందు సూర్య నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఈ సినిమా సక్సెస్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు సూర్య. ఇప్పుడాయన ఫుల్ ఖుషీలో ఉన్నారు. ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) చిత్రానికి ముందు సూర్య (Suriya) నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి.
ఈ సినిమా సక్సెస్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చారు సూర్య. ఇప్పుడాయన ఫుల్ ఖుషీలో ఉన్నారు. ‘కరుప్పు’ రూ.340 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో తదుపరి చిత్రాలపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం తెరకెక్కుతోంది.
ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పుడు సూర్యకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్య మైల్ స్టోన్ సినిమా 'సూర్య50' చేయనున్నారట. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్.
మొదట ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా రూపొందించాలని భావించారట. ఆయన ‘గాడ్ ఆఫ్ వార్’ (God of war) సినిమా కారణంగా రెండేళ్లపాటు బిజీగా ఉండనున్న నేపథ్యంలో, నిర్మాతలు సూర్యను హీరోగా తీసుకుని ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్య మలయాళ దర్శకుడు జీతూ మాదవన్‌తో చేస్తున్న ‘సూర్య 47’ చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయినట్టే. తదుపరి ‘జై బీమ్ ఫేం’ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 48వ సినిమా ఉండబోతుందని టాక్.
మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్! సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్ ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్