
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Apple Form In Telugu State: మన దేశంలో ఆపిల్ సాగు అంటే ముందుగా గుర్తొచ్చొది హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా ఆపిల్.
అటు జమ్మూ కశ్మీర్‌లోని కశ్మీర్ ఆపిల్. ఇక ఆపిల్ సాగుకు ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండాలి. అలాంటి ప్రదేశాల్లోనే ఆపిల్ పంట పండుతుంది. ఈ మధ్యకాలంలో మారిన టెక్నాలజీ ఆధారంగా అరుకు, ఆదిలాబాద్‌లో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు ఆపిల్ సాగు చేసినా..
దీర్ఘకాలంలో వర్కౌట్ కాలేదు. తాజాగా అనంతపురం ఎర్రటి ఎండల్లో రసభరితమైన ఆపిల్స్ పండించి చరిత్ర సృష్టించారు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రైతు. సాధారణంగా ఆపిల్ చెట్లు మన వాతావరణంలో పెరగలేవు. అంతేకాదు ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు సహకరించవు.
అయినా.. అనంతపురం జిల్లాలోని కోటంక అనే చిన్న గ్రామంలో 46 ఏళ్ల రైతు ఎన్.వి. రమణ రెడ్డి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు. అంతేకాదు తన పొలాల్లో ఎర్రని, రసభరితమైన ఆపిల్స్ పంటను సమృద్ధిగా పండించి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా ఆపిల్ సాగు విజయవంతం కావడం ఇదే మొదటి సారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా ద్వీపకల్ప భారతదేశంలోనే ఇది తొలి ప్రయత్నం అంటున్నారు. ఈ ఆపిల్ టేస్ట్.. సిమ్లా, జమ్మూ కశ్మీర్ ఆపిల్ టేస్ట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉందని కితాబు ఇస్తున్నారు.
తెప్పించి తన పొలంలో నాటారు. ఆ చెట్లు సరిగా పెరగలేదు. ఆపిల్ కాయలు నిమ్మకాయ పరిమాణం కంటే పెద్దవిగా రాలేదు. మూడేళ్లన్నర పాటు నిరంతర కృషితో పాటు సుమారు రూ. 8 లక్షల నష్టం తర్వాత, ఆ ప్రయోగం విఫలమైంది.
డబ్బు, సమయం వనరులన్నీ వృథా అయ్యాయి. అంతటి వేడిలో ఆపిల్ సాగు అసాధ్యమని చుట్టుపక్కల వారు ఆ రైతును నిరుత్సాహ పరిచారు. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ పంటను సాగు చేసినట్టు రమణారెడ్డి జీ మీడియాకు సంబంధించిన WIONతో చెప్పారు.
అతను ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న ఒక స్నేహితుడి ద్వారా అక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేక ఆపిల్ రకం గురించి తెలిసింది. ఎండిన నేలలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రకం అది. ఆ ఫ్రెండ్ ద్వారా 'మదర్ ప్లాంట్' (మూల మొక్క)ను పార్శిల్ ద్వారా భారతదేశానికి పంపారు. తదుపరి ఆరు నెలల పాటు, రమణ రెడ్డి ఇంట్లోనే ఆ మొక్కల అంటుకట్టడం (grafting) పెంపకంపై పనిచేశారు.
2024లో, తీవ్రమైన నీటి కొరతను అధిగమించడానికి బిందు సేద్యం (drip irrigation) పద్ధతిని ఉపయోగిస్తూ, రెండున్నర ఎకరాల్లో సుమారు 600 మొక్కలను నాటారు. ఆ తర్వాత జరిగినదంతా చరిత్రే," అని ఆయన ఎంతో ఉత్సాహంతో చెప్పారు.
ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలోనే, రమణ రెడ్డి రెండు టన్నుల ఆపిల్స్ పంటను సాధించి స్థానిక మార్కెట్లో విక్రయించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో తాజా ఆపిల్స్ ఏమాత్రం లభించవు.
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ నుండి వచ్చే సాంప్రదాయ హిమాలయన్ ఆపిల్స్ నవంబర్, జనవరి మధ్య వినియోగదారులకు అందుతాయి. ఆ తర్వాత లభించేవి సాధారణంగా కోల్డ్-స్టోరేజ్‌లో నిల్వ ఉంచిన పండ్లు, ఇవి తమ సహజ రుచిని చాలా వరకు కోల్పోయి ఉంటాయి.
మెయిన్ సీజన్ ముగిసిన నెల రోజుల తర్వాత కూడా మార్కెట్లో సిమ్లా యాపిల్స్ దొరుకుతాయి, కానీ అవి నిల్వ ఉంచిన పండ్లు కాబట్టి అంత రుచిగా ఉండవు. మా ఆపిల్స్ మాత్రం తాజాగా, రసభరితంగా ఉంటాయని చెబుతున్నారు. ఆఫ్-సీజన్లో కూడా ఇవి సహజంగానే లభిస్తున్నట్టు రమణ రెడ్డి చెప్పారు.
ఈ పండ్ల నాణ్యత, రుచి చూసి అందరు ఆశ్చర్యపోయారు.రంగు, రుచి విషయంలో తన యాపిల్స్ ప్రసిద్ధ సిమ్లా రకంతో సమానంగా ఉంది. వ్యవసాయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి పేరుపొందిన రమణ రెడ్డి ప్రస్థానంలో, ఈ యాపిల్ తోట పెంపకం ఒక సరికొత్త అధ్యాయం. కొన్నేళ్ల క్రితం, థాయిలాండ్ నుండి మొక్కలను తెప్పించి ఈ ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రవేశపెట్టిన తొలి రైతుల బృందంలో ఆయన ఒకరు. అలాగే అబుదాబి నుండి మొక్కలను సేకరించి ఖర్జూర సాగును కూడా ఇక్కడ మొదటగా చేపట్టారు. ఈ రెండు ప్రయోగాలు ఇప్పుడు విజయవంతమయ్యాయి.
ఈ విజయం జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మాటలు..
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అనంతపురం వంటి ప్రాంతంలో ఇంత ఎర్రగా, రసభరితంగా రుచికరంగా ఉండే యాపిల్స్ పండటం చూడగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. ముస్సోరీలో మా శిక్షణ సమయంలో యాపిల్ తోటలను చూసిన జ్ఞాపకం నాకుంది. ఇదో పెద్ద విజయగాథ. మేము ఈ సాగు విధానాన్ని పరిశీలించి, మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న యాపిల్ సాగును చేపట్టేలా ఇతర రైతులను ప్రోత్సహిస్తాము.
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఎండిపోయిన నేలగా ఉండే అనంతపురం, యాపిల్స్ సాగుకు అనువైన ప్రదేశం ఏమీ కాదు. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు తరచుగా 45°C దాటుతుంటాయి, అలాగే ద్వీపకల్ప భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ఇది ఒకటి.
అయినప్పటికీ, కోటంక అనే సాధారణ గ్రామంలో, 46 ఏళ్ల రైతు ఎన్.వి. రమణ రెడ్డి అసాధ్యమని భావించిన పనిని సుసాధ్యం చేసి చూపించారు. సాధారణంగా యాపిల్ చెట్లను పూర్తిగా చంపేసే వాతావరణ పరిస్థితుల్లో కూడా, ఆయన ప్రకాశవంతమైన ఎరుపు రంగులో, రసభరితంగా ఉండే యాపిల్స్ భారీ దిగుబడిని సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా లాభదాయకమైన యాపిల్ సాగుకు ఇది మొదటి ఉదాహరణ అని, బహుశా ద్వీపకల్ప భారతదేశంలోనే ఇది తొలి ప్రయత్నం అని అందరు చెబుతున్నారు. ముఖ్యంగా రమణ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
2020లో, రమణ రెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుండి మూడు రకాల ఆపిల్ మొక్కలను