
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న సాంకేతిక మార్పులతో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయినా ఇండియా వివిధ అంతర్జాతీయ సూచీల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. భారత్ రక్షణ రంగంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలిచింది.
ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో భారత్‌కు అది అనివార్యమే. అయితే ఇండియన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల (ఈఎమ్ఎస్) రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తుండటం విశేషం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకాలు, స్మార్ట్ పరికరాలకు పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణాలు.
దేశీయ ఈఎంఎస్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో భారీగా విస్తరించి ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ రాబోయే ఐదేళ్లలో దాదాపు 3 రెట్లు పెరిగి, సుమారు రూ. 14.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.
'మేక్ ఇన్ ఇండియా', ఈసీఎంఎస్ , సెమీకండక్టర్ ప్రోత్సాహకాల ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. కొత్తగా ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ ప్లాంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. మొబైల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సాధారణ అసెంబ్లీ స్థాయి నుండి..
పీసీబీలు , కెమెరా మాడ్యూల్స్, చిప్ తయారీ వరకు పరిశ్రమ విస్తరిస్తోంది. ఈ రంగం దేశంలో లక్షల కొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తోంది. భవిష్యత్తులో కేవలం అసెంబ్లింగ్ కాకుండా సొంత డిజైన్లు, మేధో సంపత్తి (IP)ని అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి పెడుతోంది.
భారత్ ఈఎంఎస్ 2030 నాటికి 150 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని కేపీఎంజీ నివేదికలు విశ్లేషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ రంగంలో భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్‌ను అధిగమించి టాప్ 5లోకి ప్రవేశించింది. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం భారత తయారీ ఉత్పత్తి విలువ 781 బిలియన్ డాలర్లకు చేరి, దక్షిణ కొరియా, యుకే, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టింది.
నడిచింది. దాంతో చైనా ఆధిపత్యం ఉన్న గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సరఫరాలో భారత్ పాత్ర చాలా కాలం పాటు పరిమితంగా, తక్కువ విలువ కలిగిన అసెంబ్లింగ్ కార్యకలాపాలకే పరిమితమైంది.
1990లలో లిబరలైజేషన్ తర్వాత, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం, కంప్యూటింగ్ పరికరాల దిగుమతులు పెరిగినా, దేశీయ తయారీకి అవసరమైన భాగాల, సెమీకండక్టర్ల, హై–ఎండ్ కంపోనెంట్ల ఎకోసిస్టమ్ మాత్రం అభివృద్ధి చెందలేదు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్–అప్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాతే, ఎలక్ట్రానిక్స్ తయారీని వ్యూహాత్మక రంగంగా ప్రభుత్వం గుర్తించి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి పథకాల ద్వారా ప్రోత్సాహం పెరిగింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో 25–30 శాతం వరకు చైనా వాటా ఉంటూ వచ్చింది. ఆ పరిస్థితి మారుతూ ఇటీవల కాలంలో భారత్, వియత్నాం, మెక్సికో వంటి దేశాలను ప్రత్యామ్నాయ ఎలక్ట్రానిక్ హబ్‌లుగా చూస్తున్నారు.
మేక్ ఇన్ ఇండియా, “ఆత్మనిర్భర్ భారత్” వంటి నినాదాలు, ఎలక్ట్రానిక్స్ తయారీని గణనీయంగా పెంచి టెక్నాలజీ స్వావలంబనతో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేస్తున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ రంగంలో టాప్ 5లోకి ప్రవేశించడం, ఇంగ్లాండ్‌ను అధిగమించడం వంటి అంశాలు రాజకీయంగా కూడా ప్రచారం పొందుతున్నాయి. ఈఎంఎస్ రంగం విస్తరణతో, స్కిల్డ్ టెక్నీషియన్లు, ఇంజినీర్లు, లైన్–వర్కర్లు, లాజిస్టిక్స్, క్వాలిటీ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అయితే మన దేశంలో హై–ఎండ్ డిజైన్, కంపోనెంట్ తయారీకి అవసరమైన డీప్ ఇంజినీరింగ్ స్కిల్స్ అభివృద్ధి ఇంకా పరిమితంగా ఉంది.
వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, చైనా (4.16 ట్రిలియన్), అమెరికా (2.49 ట్రిలియన్), జపాన్ (1 ట్రిలియన్), జర్మనీ (848 బిలియన్) తర్వాత, భారత్ 781 బిలియన్ డాలర్ల ఉత్పత్తితో టాప్–5లోకి ప్రవేశించింది. ఇది ఒకవైపు గొప్ప విజయమైతే, ఈ 781 బిలియన్లో ఎంత శాతం హై–విల్యూ, హై–టెక్ తయారీ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 80–95% దిగుమతి ఆధారితత, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కంపోనెంట్ ఎకోసిస్టమ్ రంగాల్లో లోపం, డిజైన్–IP లో వెనుకబాటు వంటి నిర్మాణాత్మక బలహీనతలు అందుకు కారణం. దీర్ఘకాలిక స్వదేశీకరణ, రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్, స్కిల్–డెవలప్మెంట్ లేకుండా, “మేక్ ఇన్ ఇండియా” నినాదం కేవలం ఎలక్ట్రానిక్ పరికరాల అసెంబ్లింగ్ స్థాయిలోనే నిలిచిపోవచ్చంటున్నారు. భారత ఎలక్ట్రానిక్స్ తయారీ విప్లవం నిజంగా విజయవంతం కావాలంటే, అసెంబ్లీ–కేంద్రిత వృద్ధిని దాటి, లోతైన టెక్నాలజీ, ఇంజినీరింగ్, కంపోనెంట్ తయారీ, రీసెర్ట్ అండ్ డెవలప్మెంట్ ఆధారిత మోడల్‌కి మారాల్సిన అవసరం ఉంది.
2060 నాటికి చైనాను మించిన ఆర్థికశక్తిగా ఇండియా!
.
భారతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత మూడు దశాబ్దాలుగా అసెంబ్లిగ్కే పరిమితమై ఎక్కువగా