
Today Gold Rate: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, బంగారం ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మంగళవారం కూడా గరిష్ఠ స్థాయిల వద్దనే కొనసాగాయి.
అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న అనిశ్చితులు బంగారానికి మద్దతు ఇస్తున్నాయి. Read also: Stock market: ట్రంప్ ప్రకటనతో పరుగులు తీస్తున్న నిఫ్టీ, సెన్సెక్స్! అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు బలంగా నిలిచాయి.
సోమవారం ట్రేడింగ్‌లో పసిడి ధర రెండు శాతానికి పైగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 4,300 డాలర్ల సమీపంలో కొనసాగుతోంది. మరోవైపు, ముడి చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ, డాలర్ బలహీనత కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,540 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,910గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గడిచిన ట్రేడింగ్ సెషన్లో మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,450 వరకు పెరగడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నై – రూ.1,53,500, ముంబై – రూ.1,51,540, ఢిల్లీ – రూ.1,51,690, కోల్‌కతా – రూ.1,51,540, బెంగళూరు – రూ.1,51,540, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు: చెన్నై – రూ.1,40,710, ముంబై – రూ.1,38,910, కోల్‌కతా – రూ.1,38,910,బెంగళూరు – రూ.1,38,910, ఢిల్లీ – రూ.1,39,060గా
కొనసాగుతోంది.
డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు మరియు భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరల్లో సమీప భవిష్యత్తులో కూడా హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Anitha vs Amaranth : ‘మేకప్ మంత్రి’ అంటూ అమరనాథ్ చేసిన కామెంట్స్ పై దుమారం
Pawan Kalyan: జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్.. అమరవీరులకు ఘన నివాళి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Stock market: ట్రంప్ ప్రకటనతో పరుగులు తీస్తున్న నిఫ్టీ, సెన్సెక్స్!
Vedanta Demerger:మార్కెట్లోకి వేదాంత గ్రూప్ 4 కొత్త షేర్లు.. తొలిరోజే ఒకదానికి లోయర్ సర్క్యూట్.. ఇంకోటి లాభాల్లో!
Apple Foldable iPhone: ఆపిల్ లవర్స్‌కు క్రేజీ అప్డేట్.. మడతపెట్టే ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్
Microsoft CEO : AI ముప్పు ..ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలిపై సత్య నాదెళ్ల దిశా నిర్దేశం
Gold Price Today June 15th 2026 : భారీగా పెరిగిన బంగారం ధరలు
E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026