
కొంతమంది ఎంత శ్రమించినా జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతుంటారు. జీవితంలో ఎదుగుదలకు అడ్డుగా నిలిచే ఆ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కొంతమంది ఎంత కష్టపడినా జీవితంలో పెద్దగా పురోగతి సాధించలేరు. మరోవైపు, కొందరు మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతుంటారు.
దీనికి అదృష్టం మాత్రమే కారణం కాదని, కొన్ని అలవాట్లు, ఆలోచనా విధానాలే ప్రధాన కారణమని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నామో స్పష్టత లేకపోతే సరైన దిశలో ప్రయాణించడం కష్టం. లక్ష్యం లేకుండా కష్టపడితే ఫలితం ఆశించినంతగా ఉండదు.
అందుకే ముందుగా లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అవసరం. వైఫల్యం వస్తుందేమోననే భయంతో చాలామంది కొత్త అవకాశాలను ప్రయత్నించరు. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఈ భయం విజయానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది.
ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారి ప్రభావం మనపై పడుతుంది. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారితో ఉంటే మన ఆలోచనా విధానం కూడా అలాగే మారుతుంది. దీంతో అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంటుంది. విజయం సాధించాలంటే నిరంతర శ్రమ అవసరం.
కానీ కొందరు సౌకర్యాలకు అలవాటు పడి కష్టపడటాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. పనులను వాయిదా వేయడం, సోమరితనం వంటి అలవాట్లు లక్ష్యాలను దూరం చేస్తాయి. కాలంతో పాటు మారడం చాలా ముఖ్యం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త పద్ధతులను అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి.
మార్పుకు భయపడేవారు అవకాశాలను కోల్పోయి వెనుకబడిపోతారు. జీవితంలో ఎదగాలంటే స్పష్టమైన లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం, మంచి సాంగత్యం, కష్టపడే తత్వం, మార్పును స్వీకరించే మనస్తత్వం అవసరం. ఈ అలవాట్లను పెంపొందించుకుంటే విజయానికి మార్గం సులభమవుతుంది.
ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు