
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో ముఖ్యమైన ప్రాజెక్టును మంజూరు చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) హెడ్‌క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు ప్రత్యేక డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఝార్ఖండ్ (Jharkhand)కు మంజూరు చేసిన రెండు డైరెక్టరేట్లతో దేశవ్యాప్తంగా ఉన్న వీటి సంఖ్య 17 నుంచి 19కి పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో డైరెక్టరేట్ ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఎన్సీసీ (NCC) కార్యక్రమాలు మరింత దగ్గరవుతాయి.
దీంతో మునుపటి కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికీ వీలవుతుంది. ఎన్సీసీ 1948లో 20 వేల మంది క్యాడెట్స్‌తో ఏర్పాటైంది. ఇప్పుడు ఈ సంఖ్య 20 లక్షల స్థాయికి విస్తరించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద యÖనిఫామ్డ్ యÖత్ ఆర్గనైజేషన్‌గా ఎన్సీసీ అవతరించింది
.