
ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా జరిగింది. కాలిఫోర్నియా మొజావే ఎడారిలోని ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం సమీపంలో బి-52 బాంబర్ విమానం కూలిపోయింది.
సాధారణ పరీక్షా మిషన్ లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఎనిమిది మంది సిబ్బంది దుర్మరణం చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద స్థలాన్ని అదుపులోకి తీసుకుని.. ఎయిర్ ఫీల్డ్ ను మూసివేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వైమానిక దళ అధికారులు స్పష్టం చేశారు.ఓ వైపు ఇరాన్ తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో సైనిక విమానం కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం ఈ బి-52 బాంబర్ విమానం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు టేకాఫ్ అయింది. అయితే కొద్దిసేపటికే ఆ విమానం మొజావే ఎడారిలో కుప్పకూలింది. ఎడారిలో దట్టమైన బ్లాక్ పొగ వ్యాప్తి చెందిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికి తీస్తున్నాయి.ఈ ప్రమాదంపై కల్నాల్ జేమ్స్ హెయిస్ మాట్లాడుతూ.. విమానంలోని సిబ్బంది మొత్తం మృతి చెందారని అన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని పేర్కొన్నారు.
అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకూ తెలియలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టామని దర్యాప్తు పూర్తయ్యే సరికి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. అయితే ఫ్లైట్ కంట్రోల్ లో మాల్ ఫంక్షన్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఏవియేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ బి-52 బాంబర్ విమానాలను తొలిసారిగా అమెరికా ఎయిర్ ఫోర్స్ లో 1955లో ప్రవేశపెట్టారు. ఈ విమానాలు సూదూర ప్రాంతాలకు అణు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి
ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా జరిగింది. కాలిఫోర్నియా మొజావే ఎడారిలోని ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరం సమీపంలో బి-52 బాంబర్ విమానం కూలిపోయింది. సాధారణ పరీక్షా మిషన్‌ లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో ఎనిమిది మంది సిబ్బంది దుర్మరణం చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాద స్థలాన్ని అదుపులోకి తీసుకుని.. ఎయిర్‌ ఫీల్డ్‌ ను మూసివేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వైమానిక దళ అధికారులు స్పష్టం చేశారు.ఓ వైపు ఇరాన్ తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో సైనిక విమానం కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ బి-52 బాంబర్ విమానం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు టేకాఫ్ అయింది. అయితే కొద్దిసేపటికే ఆ విమానం మొజావే ఎడారిలో కుప్పకూలింది. ఎడారిలో దట్టమైన బ్లాక్ పొగ వ్యాప్తి చెందిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికి తీస్తున్నాయి.ఈ ప్రమాదంపై కల్నాల్ జేమ్స్ హెయిస్ మాట్లాడుతూ.. విమానంలోని సిబ్బంది మొత్తం మృతి చెందారని అన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని పేర్కొన్నారు. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకూ తెలియలేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టామని దర్యాప్తు పూర్తయ్యే సరికి 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. అయితే ఫ్లైట్ కంట్రోల్ లో మాల్ ఫంక్షన్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఏవియేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ బి-52 బాంబర్ విమానాలను తొలిసారిగా అమెరికా ఎయిర్ ఫోర్స్ లో 1955లో ప్రవేశపెట్టారు. ఈ విమానాలు సూదూర ప్రాంతాలకు అణు, సంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విమానాలు పాతవి కావడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.