
రెండో రోజు సింగరేణి పర్యటన సందర్భంగా ఆర్కే 7 గని దగ్గర గేట్ మీటింగ్‌కు అనుమతి లేదంటూ కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కవిత గేట్ తోసుకుని లోపలకు వెళ్లి కార్మికులను కలిశారు. హైదరాబాద్, జూన్ 16: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులకు చేరువయ్యేందుకు బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమె మంచిర్యాలలో పర్యటిస్తున్నారు. రెండో రోజు సింగరేణి పర్యటన సందర్భంగా ఆర్కే 7 గని దగ్గర గేట్ మీటింగ్‌కు అనుమతి లేదంటూ కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కవిత గేట్ తోసుకుని లోపలకు వెళ్లి కార్మికులను కలిశారు.
తనను పోలీసులు అడ్డుకోవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత మాట్లాడుతూ.. ‘గతంలో రాహుల్, రేవంత్, భట్టి సింగరేణిలో పర్యటించలేదా? కార్మికుల సమస్యలు తెలుసుకుంటే తప్పేంటి?. పోలీసులను పెట్టుకుని ఎన్నిరోజులు అధికారంలో ఉంటారు?.
కార్మికుల సమస్యలపై టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..‘అడవిలో అన్నలు ఉంటే.. అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది. సింగరేణి అధికారులు పద్ధతిగా పనిచేసేవారు.
అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కులేదని.. సింగరేణి యాజమాన్యం అనుకుంటోంది. కానీ, అడవిలో అన్నలందరూ ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతాం’ అని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి ఇరాన్‌కు డబ్బులు ఇవ్వలేదు..
అవన్నీ ఫేక్ న్యూస్: ట్రంప్