జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. 2024 దసరా సీజన్ లో రిలీజైన పార్ట్-1 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. భారీ కలెక్షన్స్ రాబట్టింది. రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
దీని ప్రకారం, ఇది తారక్ కెరీర్ లో సోలోగా అత్యధిక గ్రాస్ అందుకున్న మూవీ. అందుకే దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ‘ దేవర 2 ’ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు.‘దేవర’ పార్ట్-1లో సగం కథ మాత్రమే చెప్పారు.
చెప్పాల్సిన కథ ఇంకా చాలా ఉంది. మొదటి భాగంలో ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్నలన్నింటికీ, పార్ట్-2లో సమాధానం దొరుకుతుందని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. కానీ దేవర కథ పూర్తిగా ఎప్పుడు చెప్తారనే దానిపై స్పష్టత రావడం లేదు. ‘దేవర 1’ వచ్చి 20 నెలలు గడిచిపోయినా..
ఇంతవరకూ ‘దేవర 2’ చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియడం లేదు.సాధారణంగా ఒక సినిమా హిట్టయిన వెంటనే, ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని పార్ట్-2 సెట్స్ పైకి తీసుకెళ్తారు. బాహుబలి-2, పుష్క-2, కేజీఎఫ్-2 లాంటి క్రేజీ సీక్వెల్స్ అలానే వచ్చాయి.
కానీ ‘దేవర’ విషయంలో సీన్ రివర్స్ అయింది. మొదటి భాగం భారీ వసూళ్లు సాధించినప్పటికీ, రెండో భాగాన్ని ఇంతవరకూ ప్రకటించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తున్నా.. ఎలాంటి అప్డేట్ లేదు.* నా హృదయాన్ని హత్తుకున్న అందమైన చిత్రం..
‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలుఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర-2’ అనౌన్స్ మెంట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ రాలేదు. నిన్న సోమవారం (జూన్ 15) దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈసారైనా దేవర పార్ట్-2 ప్రకటన వస్తుందని ఎదురు చూశారు.
అంతా ఊహించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దేవర టీమ్ నుంచి దర్శకుడికి శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టర్ వదిలారు. అందులో సీక్వెల్ ప్రస్తావన లేదు.లాస్ట్ ఇయర్ ‘దేవర 2’ కోసం వేచి చూస్తున్నా అంటూ కొరటాలకు బర్త్ డే విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఈ ఏడాది ఆ ప్రస్తావన లేకుండానే శుభాకాంక్షలు చెప్పి మమ అనిపించారు. ఇవన్నీ చూస్తుంటే, అసలు ‘దేవర’ సీక్వెల్ ఉంటుందా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ‘డ్రాగన్’ మూవీతో తారక్ బిజీ అయిపోవడం.. నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం కూడా ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చాయి.గతంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పార్ట్-2 పక్కన పెట్టేశారు. ‘హరి హర వీరమల్లు’, ‘కింగ్డమ్’, ‘పెదకాపు 1’ లాంటి సినిమాల్లో సంగం కథనే చెప్పారు. అయితే మొదటి భాగాలు డిజాస్టర్లుగా మారడంతో, కొనసాగింపు చిత్రాలు అటకెక్కాయి. స్కంద, ఈగల్, రాజాసాబ్ లాంటి మరికొన్ని సినిమాల సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం లేదు. ఎందుకంటే ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ ‘దేవర 1’ మూవీ మంచి వసూళ్లు సాధించి, తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి భవిష్యత్ లో ‘దేవర 2’ వస్తుందేమో చూడాలి.
ఎప్పుడు వస్తుందో చెప్పకపోయినా.. రెండో భాగంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని