
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా- ఇరాన్ (USA- Iran)మధ్య కుదిరిన డీల్‌కు సంబంధించి కీలక ముందడుగు పడింది. శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ (MOU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ సంతకాలు చేశారు.
డిజిటల్ రూపంలో ఈ సంతకాలు జరగ్గా.. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అధికారిక కార్యక్రమం ఉంటుంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్(Donald Trump) పునరుద్ఘాటించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ (Iran)కు అమెరికా 300 మిలియన్ డాలర్లు అందించనుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే, ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వీటిని కొట్టిపారేశారు. డెమోక్రట్లు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక, జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ఫ్రాన్స్‌కు వచ్చిన ట్రంప్ అక్కడ మీడియాతో మాట్లాడారు. స్విట్జర్లాండ్‌లో జరిగే సంతకాల కార్యక్రమానికి అమెరికా బృందానికి జేడీ వాన్స్ (JD Vance) నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎంవోయూపై సంతకాల గురించి జేడీ వాన్స్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వారాంతంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా ఉండటమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు.
శాంతి ఒప్పందం కోసం అధ్యక్షుడు అనేక ప్రయత్నాలు చేశారని.. చివరికి అది మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఎంవోయూపై సంతకాలు జరగడాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్వాగతించారు. నెలలతరబడి జరిగిన చర్చలు, నిరంత దౌత్య ప్రయత్నమే దీని ఫలితమని పేర్కొన్నారు.
ఇక, ఈ అవగాహన ఒప్పందంలో లెబనాన్ అంతర్భాగంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు