
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొన్ని చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది. కొన్ని సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్, మరికొన్ని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది. సినిమా విషయంలో అనుష్క డెడికేషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నమ్మితే ఆ చిత్రం కోసం నయనతార ఎంత దూరమైన వెళుతుంది అని ఇండస్ట్రీలో అంతా ప్రశంసిస్తుంటారు.
అనుష్క కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసింది. అయితే అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ మూవీ మాత్రం అరుంధతి. ఈ మూవీలో అనుష్క పాత్ర ట్రెడిషనల్ గా ఉంటుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనుష్కకి ఒక క్రేజీ కమర్షియల్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఆ మూవీ మరేదో కాదు.. ప్రభాస్ బిల్లా. డైరెక్టర్ మెహర్ రమేష్ అనుష్కని నోవాటెల్ హోటల్ లో కలిశారట. నాకు అనుష్క అరుంధతి మూవీ గురించి ఏమీ తెలియదు. అందులో ఆమె లుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ బిల్లా మూవీలో మాత్రం ఆమె మోస్ట్ గ్లామరస్ గా కనిపించాలి.
ఇది స్టైల్, గ్లామర్ ఎక్కువగా ఉన్న చిత్రం. కాబట్టి నీ బెస్ట్ లుక్ కావాలి అని చెప్పా. హిందీలో ప్రియాంక చోప్రా, తమిళంలో నయనతార చేశారు. వాళ్ళని పట్టించుకోకుండా ఈ మూవీలో నీ బెస్ట్ ఇవ్వాలి అని చెప్పాను. అనుష్కకి నచ్చక పోతే అస్సలు చేయదు.
నచ్చితే మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తుంది. నేను అలా చెప్పగానే అనుష్క ఓకె చెప్పింది. తన లుక్ మార్చుకోవడానికి హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్ళింది. అది అనుష్క డెడికేషన్ అని మెహర్ రమేష్ ప్రశంసలు కురిపించారు. తమిళంలో నయనతార కంటే గ్లామరస్ గా అనుష్క బిల్లా మూవీలో కనిపించింది అని ప్రశంసలు దక్కాయి
.