
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPFO High Court verdict: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని చెల్లించడంలో కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ.. రిటైర్మెంట్ చేసిన ఉద్యోగి ఆ డబ్బును తిరిగి ఇవ్వమని ఆడగలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈపీఎఫ్ఓ జారీ చేసిన రూ. 2.5కోట్ల రికవరీ నోటిసును కొట్టివేస్తూ కోర్టు ఇలా చెప్పింది. రిటైర్మెంట్ చేసిన ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ డబ్బును తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్ఓ కోరడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ లో ఏవైనా నిబంధనలు, ఉల్లంఘనలు జరిగినట్లయితే వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్ దేనని..
ఉద్యోగిది కాదని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్ 6276పై ఈ తీర్పునిచ్చారు. పదవీవిమరణ చేసిన ఉద్యోగి జేవి న్రుపేంద్ రావుకు ఈపీఎఫ్ఓ జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది.
అయితే సదరు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్ఓకు ఇచ్చింది కోర్టు. అసలు విషయం.. ఏం జరిగిందో తెలుసుకుందాం: ఈ కేసు 2023లో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జెవి నృపేంద్ర రావుకు సంబంధించినది. రిటైర్మెంట్ సమయంలో, ఆయన తన పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.
2.5 కోట్లు అందుకున్నారు. ఆయనకు సుమారుగా రూ. 70 లక్షలు కూడా అందాల్సి ఉండగా, ఈ మొత్తం యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోయింది. బ్యాంకింగ్, నియంత్రణ సంస్థల చర్యల కారణంగా, ఈ బాండ్లను స్తంభింపజేయడంతో, చెల్లింపు నిలిచిపోయింది. మార్చి 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా
కంపెనీ తన పీఎఫ్ ట్రస్ట్ మినహాయింపు హోదాను రద్దు చేయడంతో ఈ వివాదం మొదలైంది. నిబంధనల ప్రకారం, ఒక పీఎఫ్ ట్రస్ట్ తన మినహాయింపు హోదాను కోల్పోయిన తర్వాత, అది తన మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈపీఎఫ్ఓకు బదిలీ చేయాలి. అలా చేయకుండా, కంపెనీ జూలై 21, 2023న రావుకు రూ. 2.5 కోట్లు చెల్లించిందని, ఇది ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్ఓ ఆరోపించింది. తర్వాత.. 2025 ఫిబ్రవరి 17న, రూ. 2.5 కోట్లను 12 శాతం వార్షిక వడ్డీతో పాటు 7 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని కోరుతూ EPFO రావుకు నోటీసు జారీ చేసింది. కంపెనీ ఇప్పటికే తన మినహాయింపును వదులుకున్నందున, ఈ చెల్లింపు నిబంధనలకు విరుద్ధమని EPFO వాదించింది.
ఈ నోటీసుతో కలత చెందిన నృపేంద్ర రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు అందిన మొత్తం తన సొంత పీఎఫ్ వాటా అని, ఒక ఉద్యోగిగా దానిపై తనకు చట్టబద్ధమైన హక్కు ఉందని ఆయన వాదించారు. తన డబ్బును తిరిగి ఇవ్వమని డిమాండ్ చేసేందుకు ఈపీఎఫ్ఓకు చట్టపరమైన అధికారం లేదని కూడా ఆయన వాదించారు. నోటీసు జారీ చేయడానికి ముందు, కారణం చూపమని నోటీసు ఇవ్వలేదు. అలాగే తన వాదన వినిపించుకోవడానికి అవకాశం కూడా కల్పించలేదు. అందువల్ల, ఈ చర్య సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించారు.
దీనిపై స్పందించిన కోర్టు విచారణ సందర్భంగా, కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ 1981 నుండి మినహాయింపు కేటగిరీలో ఉందని, మార్చి 2023లో ఆ హోదాను వదులుకుందని ఈపీఎఫ్ఓ కోర్టుకు తెలియజేసింది. చట్టం ప్రకారం, కంపెనీ మొత్తం పీఎఫ్ మొత్తాన్ని ఈపీఎఫ్ఓకు బదిలీ చేయాల్సి ఉందని, కానీ అలా చేయలేదని ఈపీఎఫ్ఓ వాదించింది. అయితే, జస్టిస్ నాగేష్ భింపక ఈపీఎఫ్ఓ వాదనలను అంగీకరించలేదు. కోర్టు ఇలా పేర్కొంది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ లో ఏవైనా నిబంధనలు, ఉల్లంఘనలు జరిగినట్లయితే వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్ దేనని.. ఉద్యోగిది కాదని కోర్టు తేల్చి చెప్పింది.
కేవలం కంపెనీ తప్పు చేసిందనే ఆరోపణల ఆధారంగా ఒక ఉద్యోగి నుండి పీఎఫ్ నిధులను తీసుకునేందుకు అనుమతించే స్పష్టమైన చట్టపరమైన నిబంధనను ఈపీఎఫ్ఓ ఉదహరించడంలో విఫలమైందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఉద్యోగికి జరిగిన మోసం, తప్పుడు ప్రాతినిధ్యం లేదా కుమ్మక్కుకు సంబంధించిన ఆరోపణలు ఏవీ లేవని కూడా కోర్టు గమనించింది. EPFO రికవరీ నోటీసును కొట్టివేసింది. అయితే పీఎఫ్ ట్రస్ట్ రూల్స్ ఉల్లంఘించిందా లేదా అనే అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అవసరమైతే పీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్ పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్ఓకు స్వేచ్చ ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.