
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hyderabad Metro Dispute: 'తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిమంత్రిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడు.
71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని బీజేపీ దేకడం లేదు. ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చేతకానితనంపై మెట్రో రెండో దశపై రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేతకానితనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్‌దే అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ చొరవ తీసుకుని '28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
రెడ్డి ప్రతిపాదించాడని తెలిపారు. కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది' అని వెల్లడించారు.
బడేభాయ్ ని మెప్పించి ఒప్పించలేక 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఎల్ అండ్ టీపై బెదిరింపులు, ఆస్తుల కొల్లగొట్టే కుట్రతోనే ఎల్ అండ్ టీ సంస్థ పారిపోతున్నది. ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర' అని తీవ్ర ఆరోపణలు చేశారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
బీజేపీతో చీకటి ఒప్పందాలు యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండో దశకి అనుమతి దక్కకపోవడం అని తెలిపారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై, నరేంద్ర మోదీని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అని విమర్శించారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
రేవంత్ రెడ్డి నీచమైన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. తన చేతగానితనానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్