
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Young Girl faced casting couch in the name of movie chance in Hyderabad: సినిమా ఇండస్ట్రీలో తరచుగా కాస్టింగ్ కౌచ్ అంశం వార్తలలో ఉంటుంది. ముఖ్యంగా యువతులకు సినిమాల్లో అవకాశాల పేరిట కొంత మంది తమ కామ కోరికలు తీర్చాలని కండీషన్ లను పెడుతుంటారు.
ఇలాంటి ఘటనల్ని చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే బైటపెట్టాడు. మరికొంత మంది వీటిని పట్టించు కొకుండా తమ పనిని తాము చేసుకుని వెళ్తుంటారు. ఇంకా కొంత మంది కామాంధులకు సరైన విధంగా బుద్ది చెబుతారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి.
కానీ మూవీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ పై అందరు చాలా సీరియస్ గా చర్యలు తీసుకొవాలని పోలీసుల్ని కోరుతున్నారు. కొందరు ఇలాంటి వేధింపులకు పాల్పడిన కూడా మొత్తంగా ఇండస్ట్రీ చెడ్డదని ప్రజలు భావిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా.. హైదరాబాద్ లో ఒక యువనటి లైంగిక వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఒక యువనటికి మూవీస్ లలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రను ఇప్పిస్తానని చెప్పి ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ఆమెను సంప్రదించాడు.
అతని మాటలు నమ్మి 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పటి వరకు ముందుగా ఒప్పుకున్నట్లు నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, రూ.38 వేల ప్రయాణ చార్జీలు ఇవ్వకుండా ప్రసాద్ తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన తనను కలవమని చెప్పి, బలవంతంగా కారులో ఎక్కించుకుని, తన కోరిక
తీరిస్తే ఇతర సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని సదరు నటిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో కారులో నుంచి తప్పించుకుని యువతి తన తల్లికి ఘటన గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
Read more: Sanchita Ugale Suicide: సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం.. కుంకుమ భాగ్య సీరియల్ ఫెమ్ సంచిత ఉగాలే ఆత్మహత్య.!.
ఈ క్రమంలో బాధితురాలి తల్లి ప్రసాద్ ను తీవ్రంగా మందలించి నిలదీసింది.దీంతో ప్రసాద్ బాధితురాలి తల్లిని కూడా దూషించడంతో, పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.