అరకు వ్యాలీ పచ్చని ప్రకృతితో, కాఫీ తోటలతో అందంగా ఉంటుంది. ఇక్కడ జలపాతాలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. లంబసింగిని "కశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అని పిలుస్తారు. ఇక్కడ చల్లటి వాతావరణం, పొగమంచుతో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సమీపంలో ఉండే మరో హిల్ స్టేషన్ ఊటీ.
తమిళనాడులో నీలగిరి కొండల మధ్య, అందమైన సరస్సులతో చాలా బాగుంటుంది. తమిళనాడులో ఉన్న యెర్కౌడ్ కూడా మంచి హిల్ స్టేషన్. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం అందరినీ ఆకట్టుకుంటుంది. తక్కువ ఖర్చుతో వెళ్లి రావచ్చు. తమిళనాడులోని పాపులర్ హిల్ స్టేషన్ ఇది.
సరస్సులు, లోయలు, మేఘాలను తాకే కొండలతో చాలా బాగుంటుంది. టైమ్ ఉంటే ఒకసారి వెళ్లి సరదాగా గడపండి. తమిళనాడులో ఉన్న కూనూర్ చాలా బాగుంటుంది. టీ తోటలు, అందమైన వ్యూ పాయింట్లు చాలా బాగుంటాయి. ప్రకృతి ప్రేమికులు వెళితే కచ్చితంగా ఫిదా అయిపోతారు.
కేరళ రాష్ట్రలో ఉన్న మున్నార్ కూడా చాలా బాగుంటుంది. కేరళలోని మున్నార్ టీ తోటలతో బాగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కేరళలో ఉన్న వయనాడ్ కూడా మంచి ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది.
అడవులు, జలపాతాలు, వన్యప్రాణులు, పర్వతాలతో అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకలోని ఈ ప్రదేశం కూడా బాగుంటుంది. కాఫీ తోటలకు ఇది ప్రసిద్ధి. సెలవుల్లో సరదాగా వెళ్లి రావొచ్చు
.