
తెలంగాణలో సైబర్ నేరాలు కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లలో నకిలీ ఖాతాలు సృష్టించి జ్యోతిష్యం, తంత్రం, వశీకరణ, ఆర్థిక సమస్యలు పరిష్కారం, వ్యాపార వృద్ధి వంటి ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తున్నారన్నారు.
జ్యోతిష్యం పేరుతో టార్గెట్ ఇలాంటి ప్రకటనలు చూసి సంప్రదించేవారిని మెల్లగా నమ్మించి డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్ళు మొదట తక్కువ మొత్తంలో ఫీజు తీసుకుని విశ్వాసం సంపాదిస్తారు. తర్వాత పూజలు, పరిహారాలు, హోమాలు వంటి పేర్లతో పెద్ద మొత్తాలు డిమాండ్ చేస్తారు.
డబ్బు చెల్లించిన తర్వాత ఇతరుల ఖాతాలకు బదిలీ చేయించి ట్రాప్ చేస్తారు. ఎవరైనా ఎక్కువ డబ్బు ఇవ్వలేనని చెప్తే బెదిరింపులకు దిగుతారు. జ్యోతిష్యం పేరుతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్న సైబర్ నేరగాళ్ళు కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారు.
ఇలాంటి గ్యాంగులు ఒకటి కాకుండా మల్టిపుల్ ఖాతాలు నడుపుతూ విస్తృతంగా కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో లాభాలు కోరేవారు ప్రధాన టార్గెట్ అవుతున్నారు.
ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసుల అలెర్ట్ జ్యోతిష్యం నమ్మకం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. జ్యోతిష్యం, తంత్రం పేరుతో వచ్చే ఏ ప్రకటనలనైనా నమ్మవద్దని పోలీసులు చెప్తున్నారు. తెలియని వ్యక్తులకు డబ్బు బదిలీ చేసే ముందు ఖాతా వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని చెప్తున్నారు.
తెలంగాణలో సైబర్ నేరాలు కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో నకిలీ ఖాతాలు సృష్టించి జ్యోతిష్యం, తంత్రం, వశీకరణ, ఆర్థిక సమస్యలు పరిష్కారం, వ్యాపార వృద్ధి వంటి ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తున్నారన్నారు. జ్యోతిష్యం పేరుతో టార్గెట్ ఇలాంటి ప్రకటనలు చూసి సంప్రదించేవారిని మెల్లగా నమ్మించి డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్ళు మొదట తక్కువ మొత్తంలో ఫీజు తీసుకుని విశ్వాసం సంపాదిస్తారు. తర్వాత పూజలు, పరిహారాలు, హోమాలు వంటి పేర్లతో పెద్ద మొత్తాలు డిమాండ్ చేస్తారు. డబ్బు చెల్లించిన తర్వాత ఇతరుల ఖాతాలకు బదిలీ చేయించి ట్రాప్ చేస్తారు. ఎవరైనా ఎక్కువ డబ్బు ఇవ్వలేనని చెప్తే బెదిరింపులకు దిగుతారు. జ్యోతిష్యం పేరుతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్న సైబర్ నేరగాళ్ళు కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు ఒకటి కాకుండా మల్టిపుల్ ఖాతాలు నడుపుతూ విస్తృతంగా కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు, వ్యాపారంలో లాభాలు కోరేవారు ప్రధాన టార్గెట్ అవుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసుల అలెర్ట్ జ్యోతిష్యం నమ్మకం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. జ్యోతిష్యం, తంత్రం పేరుతో వచ్చే ఏ ప్రకటనలనైనా నమ్మవద్దని పోలీసులు చెప్తున్నారు. తెలియని వ్యక్తులకు డబ్బు బదిలీ చేసే ముందు ఖాతా వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని చెప్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు ఎవరికీ పంచుకోవద్దన్నారు.భవిష్యత్ లో జిల్లా ఆస్పత్రుల్లో AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు.. ప్రకటించిన మంత్రి 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండిబెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డబ్బు కోల్పోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చెయ్యాలని సూచిస్తున్నారు.సైబర్ పోలీసులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాలున్నా అధికారిక చానల్స్ ద్వారా సమాచారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ వివరాలు ఎవరికీ పంచుకోవద్దన్నారు.భవిష్యత్ లో జిల్లా ఆస్పత్రుల్లో AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు