
ఏవాన్ (కనెక్టికట్): అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఏవాన్ హైస్కూల్ ప్రాంగణంలో సత్సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయత-2026 కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాలు, కళాకారులు, విద్యార్థులు, అతిథులతో ప్రాంగణం సందడిగా మారింది.
ప్రపంచానికి విలువలను పరిచయం చేసిన మహర్షుల వారసత్వాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ మహోత్సవంలో అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 800 మందికి పైగా ప్రేక్షకులు, కళాకారులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ రాయబారి డాక్టర్ మిత్రా వశిష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత దౌత్య కార్యాలయం (న్యూయార్క్) నుంచి సేవాంగ్ గ్యాల్ట్సన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఫౌండేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. భారతీయ సాహిత్య సంపదలో విశిష్ట స్థానం కలిగిన ‘పరాశర సంహిత’ గ్రంథాన్ని ఆవిష్కరించడం ద్వారా సత్సంకల్ప ఫౌండేషన్ ప్రచురణ రంగంలోకీ అధికారికంగా ప్రవేశించింది.
భారతీయ జ్ఞాన సంప్రదాయాలను పరిశోధించి, సంరక్షించి, భావితరాలకు అందించాలనే ఫౌండేషన్ సంకల్పానికి ఈ గ్రంథావిష్కరణ మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. సత్సంకల్ప ఫౌండేషన్, సుపథ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ప్రొఫెసర్ రాఘవేంద్రన్ రచించిన ‘గురుదేవోభవ’ గ్రంథాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
సద్గురు శ్రీ శివానందమూర్తి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేస్తున్న సుపథ ఫౌండేషన్ ట్రస్టీ కుమారి రాధారాణిని సన్మానించారు. భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ ఇంజనీర్, రచయిత డాక్టర్ ఎ.వి శ్రీనివాసన్, ప్రముఖ సాంస్కృతికవేత్త డాక్టర్ కాశీనాథుని ఎం.
ప్రసాద్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పండిత్ వామదేవ శాస్త్రి (డాక్టర్ డేవిడ్ ప్రాలీ)కి ప్రతిష్ఠాత్మకమైన ‘శివానంద స్మృతి పురస్కారం’ ప్రదానం చేశారు. ‘కర్మ, ధర్మం- విజ్ఞానం, సేవ, సంస్కృతితో కూడిన జీవితంలో గీతా బోధలను ఆచరించడం’ అనే అంశంపై డాక్టర్ కాశీనాథుని ప్రసంగించారు.
ఏ.వి. శ్రీనివాసన్ పంచుకున్నారు. సద్గురు శివానందమూర్తితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పండిత్ వామదేవ శాస్త్రి పంచుకున్నారు. నిర్వాహకుల కృషిని సేవాంగ్ గ్యాల్ట్సన్ అభినందించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను కొనియాడారు. డాక్టర్ మిత్రా వశిష్ఠ ‘భారతదేశపు సాఫ్ట్ పవర్ ద్వారా భారతీయ ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచంతో అనుసంధానించడం’ అనే అంశంపై మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి భరద్వాజ మహర్షి జ్ఞాన కేంద్రం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. వైమానిక శాస్త్రం, ఆయుర్వేదం, ధనుర్వేదం, రాజధర్మం వంటి రంగాలలో ఆయన చేసిన కృషిని ఆధునిక దృక్కోణంతో పరిచయం చేయడం అనేకమందిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించింది. ‘Seers of Bharat - Bharadwaja Maharshi’ పేరిట ప్రదర్శించిన కళా నాటిక అందరినీ ఆకట్టుకుంది. సత్సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ తాళ్లపాక మాట్లాడుతూ.. భారతీయత కార్యక్రమం మనల్ని మనం నిజాయతీగా ఆత్మపరిశీలన చేసుకునే, నాగరికతగా మనం సరైన దిశలోనే వెళ్తున్నామా అని ప్రశ్నించుకునే సందర్భం అని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వేదికపైనా ‘భారతీయత-2026’ని ప్రదర్శించడం మరో అరుదైన ఘట్టం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ తాను దశాబ్దాలుగా నేర్చుకున్న విలువైన అనుభవాలను డాక్టర్