
‘వార్-2’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘వార్-2’ (War 2) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండటంతో, సినిమాకు సంబంధించిన చిన్న లీక్ లేదా న్యూస్ అయినా నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో ప్రశాంత్ నీల్ తన మార్క్ మేకింగ్‌తో ఎంతోమంది నటీనటులను, వారి పాత్రలను ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ..
అసలు కథ ఏంటనేది, అందులోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్‌గా ఉంచారట. అయితే, ఈ కథను మలుపు తిప్పే ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ట్రాక్‌లోనే కృతి సనన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని, ఆమె పాత్ర సినిమాకు చాలా ప్లస్ అవుతుందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ప్రేక్షకుల మనసులో మెదిలేది ఫుల్ బ్లాక్, డార్క్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్‌లు మాత్రమే. ఆయన విజువల్స్ అన్నీ కాస్త డార్క్ థీమ్‌లోనే సాగుతుంటాయి. అయితే ‘డ్రాగన్’లో మాత్రం ప్రశాంత్ నీల్ ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం చాలా కలర్ ఫుల్‌గా ఉండబోతోందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో ప్రశాంత్ నీల్ రెగ్యులర్‌గా వాడే ఆ నలుపు లేదా డార్క్ షేడ్ ఫ్రేమ్ అసలు కనిపించదని టాక్. మరి ఎప్పుడూ డార్క్ వరల్డ్‌ను చూపించే నీల్, తారక్ కోసం ఎలాంటి కలర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ రాసుకున్నారో, అందులో ఎలాంటి ఎమోషన్స్ పండించబోతున్నారో చూడాలని ఇండస్ట్రీ వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది.
ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోసే రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ బిజు మీనన్, అశుతోష్ రాణా వంటి ఇండస్ట్రీలోని దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్
బాలీవుడ్లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
సాధారణంగా