
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tuni missing girl Gnaneswari mother emotional over false alleagtions: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్థానికంగా సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు.
స్థానిక పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి అణువణువు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారి జాహ్నవీ మిస్సింగ్ వెనుకాల ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది దారుణంగా ఫెక్ ప్రచారాలు చేస్తున్నారు. కొంత మంది జాహ్నవీ తల్లిదండ్రులపై కూడా ఆరోపణలు చేస్తున్నారు.
జాహ్నవీ తల్లి కూతుర్ని ఎవరికైన అమ్మేసి ఉంటుందని కొంతమంది, తండ్రి తన కూతుర్ని ఏమైన చేసి ఉండొచ్చని కూడా కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు కూడా పలు మార్లు జాహ్నవీ తండ్రిని విచారించారు. మరికొంత మంది ఏదైన క్రూర జంతువులు తినేసి ఉండొచ్చని కూడా ప్రచారం చేస్తున్నారు.ఇక అమావాస్య కూడా రావడంతో బాలికను బలివ్వడానికి తల్లిదండ్రులు ఎవరికైన విక్రయించి ఉంటారని కూడా ప్రచారం చేశారు.
దీనిపై నెట్టింట చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై జాహ్నవీ తల్లి చాలా ఎమోషనల్ అయ్యింది. ఒక వీడియో పెట్టి మరీ సోషల్ మీడియాలో ఫెక్ ప్రచారం చేయోద్దని కోరింది. వారం రోజుల నుంచి తాము ఏంతింటున్నాం.. ఎలా బతుకున్నామో తమకే తెలుసన్నారు.
ఒకవైపు తన కన్న కూతురు కన్పించడంలేదనే బాధ ఒకవైపు, మరోవైపు కొంత మంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, ఫెక్ ప్రచారం చేస్తు వీడియోలు, పోస్ట్ లు చేస్తున్నారని ఇది మరింత ఆవేదన
కల్గిస్తుందని భావొద్వేగంకు గురైంది. తన కూతురిపై చేస్తున్న ఫెక్ ప్రచారంపై కన్నీరు మున్నీరైంది.
దయచేసి ఇలాంటి ఫెక్ ప్రచారాలు, కామెంట్స్ చేయోద్దని కోరింది. మీకు గొప్ప మనసు ఉంటే, ఏదైన చేయాలని ఉంటే తమకు అండగా ఉండాలని లేకుంటే మీ పని మీరు చూసుకొవాలని కోరింది. అంతే కానీ పబ్లిసిటీ కోసం నెగెటివ్ ప్రచారాలు, కామెంట్లు చేయోద్దని జాహ్నవీ తల్లి చేతులు జోడించి వేడుకుంటూ ప్రాధేయ పడింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.
Read more: Tuni: తుని చిన్నారి ఎక్కడ?.. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా దొరకని ఆచూకీ, వీడని మిస్టరీ!
మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో పోలీసులకు కీలక ఆధారంగా నిలుస్తుందని భావించిన పెంపుడు కుక్క మరణించింది. ఇటీవల దానికి వెటర్నరీ వైద్యులు పోస్ట్ మార్టంపూర్తి చేశారు. వైద్యులు రిపోర్ట్ పై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.