చక్రవారం, మొగలురేకులు ఇంద్రనీల్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. అయితే అరవింద్ అంటే పెద్దగా గుర్తు పట్టారు. అదే బాసూ.. అరుంధతి సినిమాలో ఉన్నాడు కదా.. ఆ అరవింద్ అని ఫొటో చూపిస్తే.. హో ఇతనా?? చాలా సినిమాల్లో ఉన్నాడే అని గుర్తుపడుతుంటారు.
అరవింద్..వందకి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు టాలీవుడ్‌లోని అందరి హీరోలు, దర్శకులతో పనిచేశారు కానీ.. ఆయన పెద్దగా గుర్తింపు అయితే లభించలేదు. ఇక సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండే అరవింద్ ఎవరో కాదు.. నాటి బుల్లితెర స్టార్ హీరో ఇంద్రనీల్ సోదరుడు.
అయితే తన ప్రొఫెషన్ విషయాలే కాకుండా.. పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడానికి మీడియాకి దూరంగా ఉండే అరవింద్.. తాజాగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మీడియాకి దూరంగా ఉండటానికి కారణం ఉంది. గతంలో ఓ మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తే..
ఏవేవో కామెంట్లు వచ్చాయి. వీడు ఆ కులం.. ఈ కులం అంటూ కామెంట్ చేశారు. అసలు కులం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కానీ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఏమీ ఉండదు. టాలెంట్ ఉన్నోడే ఇక్కడ కింగ్. ఒక నటుడిగా నాకు మంచి అవకాశాలే వచ్చాయి. ఫస్ట్ కోడి రామకృష్ణ గారు, సురేందర్ రెడ్డి గారు నాకు లైఫ్ ఇచ్చారు.
అశోక్ సినిమాతో నాకు లైఫ్ ఇచ్చింది సురేందర్ రెడ్డి గారు. ఆయన నాకు అవకాశం ఇచ్చి ఉండకపోతే ఇలా ఉండేవాడ్ని కాదు. ఆయనకి రుణపడి ఉంటాను. ఆ తరువాత కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమాతో నాకు మంచి పేరు వచ్చేట్టు చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుండేది.
మేం ఫ్రెండ్ అయిపోయాం. పూరీ సార్ అయితే బాగా ఎంకరేజ్ చేశారు. నేనింతే సినిమాలో విలన్ బ్రదర్ క్యారెక్టర్ ఇచ్చారు. మెహర్ రమేశ్ గారు.. నన్ను ఫస్ట్ మలేషియా ట్రిప్ తీసుకుని వెళ్లారు బిల్లా
సినిమాతో. మహర్ రమేశ్ గారు మేమూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఎక్కువగా మింగిల్ కాలేను. వాళ్లని డిస్ట్రబ్ కాలేను అని అనుకుంటాను. ఎక్కువగా వెళ్లి కలవలేను. పెద్దగా పీఆర్ లేదు. అదే నా వీక్నెస్. అలా ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు లేకపోవడం వల్ల.. అరుంధతి సినిమాపై తరువాత అవతారం అనే సినిమా మాత్రమే చేశాను. మా నాన్న పోలీస్ కాబట్టి.. నేను కూడా పోలీస్ అవుదాం అనుకున్నా కానీ.. నాన్న వద్దనేవారు. నీ మైండ్ సెట్‌కి పోలీస్ ఉద్యోగం సెట్ కాదు.. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా నీ షార్ట్ టెంపర్‌కి తీసేస్తారు అని నాన్న అనేవారు. ఇంద్రనీల్ నేను బ్రదర్స్ అని చాలామందికి తెలియదు. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్నయ్యే. నేను కూడా ట్రై చేస్తా.. లేదంటే మళ్లీ వచ్చి జాబ్ చేసుకుంటానని నాన్నతో చెప్పి వచ్చాను. సీరియల్స్‌లో అన్నయ్యకి మంచి క్రేజ్ వచ్చింది. అప్పట్లో దసరాకి వాడు ఇంటికి వస్తే.. రాత్రి 12, ఒకటి అయినా కూడా జనం వెళ్లలేదు. వీడ్ని చూడటానికి ఎక్కడెక్కడ నుంచో జనం వచ్చేయడంతో.. డాడీ పోలీస్ జీపుని పంపించాల్సి వచ్చింది. మా ఇంట్లో కూడా ఓ స్టార్ ఉన్నాడని హ్యాపీగా అనిపించింది ’ అంటూ చెప్పుకొచ్చారు ఇంద్రనీల్ తమ్ముడు అరవింద్.