
బూర్గంపహాడ్, జూన్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశామని, విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా 28 ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయని.. ప్రతి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఆధార్ నమోదు కేంద్రంలో డెమోగ్రఫిక్, బయోమెట్రిక్, మ్యాండటరీ బయోమెట్రిక్, న్యూ ఎన్రోల్మెంట్ (కొత్త ఆధార్) సేవలు అందుబాటులో ఉంటాయని, 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన పిల్లలు, పెద్దలు వేలిముద్రల ద్వారా అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలని సూచించారు
.