మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. బోణీ కొట్టింది. ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ .. తన స్పిన్‌తో పాక్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టింది.
ఫైఫర్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే మహిళల టీ20 క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించింది.ప్రస్తుతం ఆమె ఖాతాలో 166 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచులో ఐదు వికెట్లు తీయడం ద్వారా.. దీప్తి..
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే థాయ్ లాండ్ బౌలర్ తైపాట్చా పుత్తవాంగ్ (165ను అధిగమించింది. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గానూ ఆమె నిలిచింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆమె.. ఈ మ్యాచులో మంచి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది."నాకు ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా నేను ఐసీసీ ప్రపంచకప్‌లలో ఆడటాన్ని ఆస్వాదిస్తా. గతంలో నేను ఎక్కడైతే ముగించానో..
ఇప్పుడు అక్కడి నుంచి మళ్లీ పునఃప్రారంభించాలని భావిస్తా. ప్రాక్టీస్ సమయంలో ఏం చేస్తానో.. మ్యాచ్ వేళ అదే చేస్తా. నిజానికి పాక్‌తో మ్యాచులో పిచ్ పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. నిరంతం నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తా.
బౌలింగ్ వీడియోలు చూస్తూ.. తప్పులు సరిదిద్దుకోవాలని చూస్తా" అని దీప్తి శర్మ పేర్కొంది. కాగా మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లోనూ దీప్తి శర్మ ఫైఫర్ నమోదు చేయడం గమనార్హం.మహిళల అంతర్జాతీయ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..166 - దీప్తి శర్మ (భారత్)*165 - తైపాట్చా పుత్తవాంగ్ (థాయ్ లాండ్)160 - హెన్రియెట్ ఇషిమ్వే (ర్వాండన్)152 - మెగన్ స్కట్ (ఆస్ట్రేలియా)148 - ఓ కామ్చోంపు (థాయ్ లాండ్)