
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) ‘స్మార్ట్ మెయింటెయినెన్స్ ప్లాన్’ (SMP) తీసుకొచ్చింది. వాహన కొనుగోలు అనంతర సేవల కోసం కాల వ్యవధి ఆధారిత ప్రీపెయిడ్ సర్వీస్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.
కస్టమర్లు దీన్ని వినియోగించుకోవచ్చు. ఎస్ఎంపీలో భాగంగా లేబర్ ఓన్లీ, పార్ట్స్-లేబర్, కమర్షియల్ వెహికల్ మైనర్ సర్వీస్, కస్టమర్ డిమాండ్ సర్వీస్, కూలంట్స్ వంటి ప్యాకేజీలు లభిస్తాయి. కారు కొనుగోలు సమయంలో లేదంటే కొనుగోలు అనంతరం ఏదైనా మారుతీ సుజుకీ వర్క్‌షాప్ వద్ద తమకు కావాల్సిన ప్యాకేజీలను కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా అన్ని మారుతీ సుజుకీ వర్క్‌షాప్‌ల్లో ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.