
దిల్లీ: తెలంగాణ కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే వారిని గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా? యువతను బలి చేసి నాయకులు గద్దెనెక్కారు.
ఒక నేల కోసం ఇంతలా ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అనిపించింది. అందుకే వారంటే గౌరవం. అమరులకు నివాళులర్పించడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వలేదు’’ అని అన్నారు. అమరులను గుర్తించేందుకు 12ఏళ్లు సరిపోలేదా?: పవన్
|