
భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'లగాన్'. ఆమిర్ ఖాన్ హీరోగా, అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.
అందులో ముఖ్యమైనది, ఈ సినిమా కోసం 'చంపానెర్' గ్రామాన్ని ప్రత్యక్షంగా నిర్మించడం.ఈ కథాంశానికి ప్రాణమైన 'చంపానెర్' అనే కరువు పీడిత గ్రామం వాస్తవానికి ఎక్కడా ఉనికిలో లేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో, భుజ్‌కు సమీపంలోని 100 ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ గ్రామాన్ని సృష్టించారు.
ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ దేశాయ్ బృందం 1999లో దాదాపు మూడు నెలల పాటు 3,000 మంది కార్మికులతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇళ్లు, సన్నని వీధులు, ఆలయం, బావులు.. ఇలా ప్రతి అంశాన్ని ఎంతో సహజంగా తీర్చిదిద్దారు.చివరకు క్లైమాక్స్‌లో కీలకమైన క్రికెట్ మైదానాన్ని కూడా వాస్తవికతకు దగ్గరగా నిర్మించడం విశేషం.
ఈ నిర్మాణ ప్రక్రియ కోసం సుమారు 26 మంది రైతుల నుంచి భూమిని సేకరించారు. స్థానిక గ్రామస్థులే నిర్మాణం పనుల్లో పాలుపంచుకోవడంతో పాటు సినిమాలోనూ నటించడం సెట్‌కు మరింత సహజత్వాన్ని చేకూర్చింది. 47 డిగ్రీల ఎండ, విషసర్పాలు, తేళ్లు వంటి ప్రమాదాల మధ్య 350 మందికి పైగా చిత్ర యూనిట్ సభ్యులు అనేక నెలల పాటు అక్కడే ఉండి చిత్రీకరణను పూర్తి చేశారు.
షూటింగ్ ముగిసిన అనంతరం ఆ సెట్‌ను పూర్తిగా తొలగించి, యథావిధిగా భూమిని రైతులకు అప్పగించారు. ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిన ఈ అద్భుత