
ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్-మొరాకో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో, ప్రముఖ యూట్యూబర్ ఐషోస్పీడ్(స్పీడ్) మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో బ్రెజిల్-మొరాకో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో, ప్రముఖ యూట్యూబర్ ఐషోస్పీడ్(స్పీడ్) మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన రొనాల్డో.. స్పీడ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా స్పీడ్ కండలు, సిక్స్‌ప్యాక్‌ను చూసి షాకయ్యాడు. ‘ఇవన్నీ నిజమైన కండలేనా? లేక ఏమైనా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా?’ అని స్పీడ్‌ను రొనాల్డో ప్రశ్నించాడు.
‘ఇదంతా నేచురల్. నా కండలు సహజంగా వచ్చాయని నిరూపించుకునేందుకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అని స్పీడ్ ఉత్సాహంగా సమాధానిమిచ్చాడు. అనంతరం రొనాల్డో తన కండలపై సందేహం వ్యక్తం చేయడాన్ని తాను ప్రశంసగా తీసుకుంటానని స్పీడ్ పేర్కొన్నాడు.
ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా ఇద్దరి మధ్య జరిగిన చమత్కార సంభాషణను చూసి నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ తన తొలి మ్యాచ్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. మొరాకోతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబరి తొలి గోల్ చేయగా, బ్రెజిల్‌కు వినిసియస్ జూనియర్ అద్భుత గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. మ్యాచ్ అనంతరం బ్రెజిల్ కోచ్ కార్లో మాట్లాడారు. ‘మొదటి మ్యాచ్ ఆధారంగా వరల్డ్ కప్‌ను గెలవలేరు. ఆరంభంలో మా ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యారు.
అని వ్యాఖ్యానించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు ఇది హెచ్చరిక గంటలా మారినా, టోర్నీ ఆరంభంలోనే పాఠాలు నేర్చుకునే అవకాశం లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే
అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి
ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఇది కేవలం తొలి మ్యాచ్ మాత్రమే. జట్టు ఇప్పుడే పరిపూర్ణ ఆట చూపాలని ఆశించడం సరికాదు’