
Ttd big update on salakatla jyeshtabhishekam: ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జూన్ 28న అన్ని రకాల ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో భక్తులు రద్దీ విపరీతంగా కొనసాగుతుంది. సమ్మర్ హలీడేస్ ముగిసిన కూడా భక్తుల ఇంకా శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్ లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలు కట్టారు.
మరోవైపు తిరుమలలో ఎస్ఎస్ డీ టొకెన్లు ఉన్న భక్తులకు 6 గంటల సమయం పట్టగా, రూ. 300 టొకెన్లు ఉన్నవారికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల ఎంట్రీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో కొన్ని రోజులుగా వరుణ దేవుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వర్షాల ప్రభావంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. తిరుమలలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.
ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని పిలుస్తారు.
ఎన్నో తరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు గాను ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా.. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
తిరుమలలో ఈ మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి అన్ని రకాల ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన జారీ చేసింది.
ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. ఇక రెండవరోజు స్వామివారికి ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు