
Harish Rao: కృతజ్ఞతకు.. ఆశ కు జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మండిపడ్డారు.. చిన్నకోడూరు మండలం శంకరాయ కుంట లో బాలవికాస వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడారు..
శంకరాయ కుంట గ్రామం కెసిఆర్ గారికి ఎంతో ప్రేమ ఉన్న గ్రామం.. గ్రామాన్ని గుర్తు చేస్తూ ఉంటారని చెప్పారు.. శంకరాయ కుంట గ్రామం చిన్నది అయిన.. మనసు మాత్రం పెద్దదే.. గతం లో ఓబుళపూర్ లో ఉండే మా గ్రామాన్ని గ్రామపంచాయతి చేయాలని కోరగానే కెసిఆర్ గారితో ప్రత్యేకించి చెప్పి నూతన గ్రామ పంచాయతీ గా చేసామన్నారు..
నేడు వాటర్ ప్లాంట్ ను ప్రారంభం చేసుకున్నాము..100 క్యాన్స్ పంపించాను..బిసి కమ్యూనిటీ హల్ నిర్మాణం చేసుకున్నాం..మీరు కోరగానే ఈ గ్రామం నుండే రింగ్ రోడ్డు పోయేల కృషి చేసిన..గ్రామం లోని నాగిరెడ్డి చెరువు కు కాళేశ్వరం నీళ్లు అందించాము.. ఇలా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నాం..
ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి భవిష్యత్ లో అన్ని పనులు ఒక్కొకటిగా పూర్తి చేసుకుందామన్నారు. నేడు ప్రారంబించుకున్నాం కానీ దాన్ని నిలబెట్టుకోవడం గ్రామ ప్రజల బాధ్యత అని అన్నారు.. నేడు ప్లాంట్ కోసం సేకరణ చేసిన డబ్బులు కూడ భవిష్యత్ లో ప్లాంట్ కాపాడుకునేందుకు ఉపయోగ పడుతాయన్నారు..
బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కెసిఆర్ గారు కాళేశ్వరం నీళ్లు తెచ్చి, రైతు బందు ఇచ్చాము, రైతు బీమా ఇచ్చాము హాస్పిటల్ లో కెసిఆర్ కిట్ ఇచ్చాము ఇలా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నాం.. కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి మోసం చేసిందని మండి పడ్డారు..
కెసిఆర్ ఇచ్చిన 2వేల పెన్షన్ ను 4వేలు చేస్తా అని, రైతు బందు 15వేలు ఇస్తామని మహిళలకు 2500 ఇస్తా అని ఆశ చూపి దగా చేసిందన్నారు.. రైతు
బందు ఏగొట్టింది, రైతు ఋణ. మాఫీ సగం చేసి చేతులు దులుపుకుంది.. రైతు బీమా రద్దు చేసిందన్నారు.. ఇలా కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి ఆశలను నిరాశా చేసిందన్నారు. మళ్ళీ వచ్చేది బి ఆర్ ఎస్ పార్టీ నే.. కెసిఆర్ నే అని అన్ని మంచి రోజులు వస్తాయని చెప్పారు.. గ్రామాన్ని ఐక్యత తో అభివృద్ధి లో ఆదర్శం గా చేసుకుందామని, గ్రామం లో నిర్మించే హనుమాన్ దేవాలయం కు నా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు…
Marius Borg Hoiby: నార్వే ప్రిన్స్ సవతి కుమారుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Cyber Crime: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Harish Rao Siddipet: ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళ రైతులు బలి!
Siddipet news: సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు
Siddipet News:పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ హామీ!
World Environment Day 2026: పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్
Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్