
ఇంటర్నెట్‌డెస్క్: ‘వ్యాపారం చేయడానికి కావాల్సింది చేతులు కాదు.. గుండెల్లో దమ్ము. ఆ దమ్ము పేరు నాయుడు’ అంటున్నారు సముద్రఖని. ఐశ్వర్య రాజేష్, సునీల్‌తో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన తాజా వెబ్‌సిరీస్ ‘ఇసకపట్నం’ (Isakapatnam).
నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మైమ్ గోపి తదితరులు నటిస్తున్నారు. ఎడిటర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలకు దీటుగా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ వేదికలు వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ‘ఇసకపట్నం’ (isakapatnam web series) కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
పోర్ట్ నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామాగా దీనిని తీర్చిదిద్దారు. అక్కడ సాగే అక్రమ దందాలన్నింటికీ నాయుడు కేంద్ర బిందువు. అలాంటి నాయుడిపై అతడి కుమార్తె ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకుంది?
తదితర అంశాలకు వాస్తవ పరిస్థితులు జోడించి ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. ‘ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు. చచ్చేంత పనిచేస్తే చాలు’ వంటి సంభాషణలు మెప్పిస్తున్నాయి.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ సహా మొత్తం 15 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత