
ఇంటర్నెట్‌డెస్క్: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే రవిబాబు నుంచి వచ్చిన తాజా చిత్రం ‘రేజర్’. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ మే 8న థియేటర్స్ అలరించింది. డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలైన ‘రేజర్’ యాక్షన్ ప్రియులను మెప్పించింది.
ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జూన్ 19న ఆహా వేదికగా స్ట్రీమింగ్కు సిద్ధమైంది. విష్ణు (తనీష్) సీసీ కెమెరాలకు సంబంధించిన ఓ కంపెనీని నిర్వహిస్తుంటాడు. భార్య లక్ష్మి, కూతురు తేజునే అతడి ప్రపంచం. ఆయన అమర్చిన ఓ సీసీ కెమెరాలో ముఖ్యమంత్రి హత్యకు సంబంధించిన విజువల్స్ రికార్డ్ అవుతాయి.
సీఎం పీఠం ఎక్కాలనుకున్న హోం మంత్రే ఆ దారుణానికి పాల్పడతాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుని హత్య చేసినా, విష్ణు అమర్చిన సీసీ కెమెరాలో హత్యోదంతం రికార్డు కావడంతో హోంమంత్రి కంగారు పడతాడు. వెంటనే విష్ణుని హత్య చేయిస్తాడు.
అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ మాత్రం హోం మంత్రి గ్యాంగ్‌కి దొరక్కుండా దాచేస్తాడు విష్ణు. తండ్రి హత్యని ప్రత్యక్షంగా చూసిన చిన్నారి తేజు ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ పాపను రక్షించే బాధ్యత రేజర్ (రవిబాబు) తీసుకుంటాడు.
కుక్కల సంరక్షకుడిగా పనిచేసే రేజర్ నేపథ్యం ఏమిటి? హోం మంత్రి, అతడి ముఠా నుంచి పాపని ఎలా రక్షించాడు?ఈ కథలో రుద్ర ఎవరు?అన్నది మిగిలిన కథ. (పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి) గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు