
Bhatti Vikramarka Birthday: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా భట్టి విక్రమార్కను అభినందిస్తూ ఒక సందేశాన్ని పంచుకున్నారు.
Read also: Telangana Politics: 2028 ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం: కేటీఆర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. “తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు.
వారు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, నిరంతర సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న సద్భావనకు ఈ సందేశం అద్దం పడుతోంది. మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఆయనకు ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది మార్చి నెలలో మల్లు భట్టి విక్రమార్క వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విక్రమార్కకు వైఎస్ జగన్ ఆహ్వానం పలికారు. అనంతరం తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్క వైఎస్ జగన్‌కు అందజేసి..
ఈ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. అందుకే ఇవాళ విక్రమార్క పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా తెలంగాణ డిప్యూటీ సీఎంకు విషెస్
చెబుతున్నారు.
US-Iran peace agreement : అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana Politics: 2028 ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం: కేటీఆర్
Telangana Weather Update: తెలంగాణకు వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Bhatti Vikramarka: సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
Telangana Private School Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్