ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఒక ప్రత్యేక రకమైన ద్రవం ఉంటుంది. ఇది గర్భంలో పెరుగుతున్న శిశువును 9 నెలల పాటు సురక్షితంగా ఉంచుతుంది. ఈ ద్రవాన్ని ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ (ఉమ్మనీరు) అంటారు.
గర్భంలో ఉన్న శిశువుకు రక్షణగా ఉండటానికి, ఒక కుషన్ లాగా పనిచేయడానికి ఉమ్మనీరు చాలా ముఖ్యం. ఇది బిడ్డ ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, కండరాలు, అవయవాలు సరిగ్గా పెరగడానికి సాయపడుతుంది. గర్భధారణ కాలానికి ఉండాల్సిన దానికంటే ఉమ్మనీరు తక్కువగా ఉండటాన్ని వైద్యభాషలో 'ఒలిగోహైడ్రామ్నియోస్' (Oligohydramnios) అంటారు.
ఉమ్మనీరు తగ్గడానికి కారణాలు, కనిపించే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శారద ఎం (సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణురాలు, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.) వివరించారు. ఆ వివరాలేంటో చుద్దాం.ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
చాలామంది మహిళల్లో ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. సాధారణంగా స్కానింగ్ (Ultrasound) చేసినప్పుడే ఇది బయటపడుతుంది. అయితే, కొందరిలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు: యోని (Vagina) గుండా ద్రవం లీక్ అవ్వడం.
కడుపులో బిడ్డ కదలికలు తగ్గడం. గర్భధారణ నెలకు తగ్గట్టుగా పొట్ట పరిమాణం (Uterus size) పెరగకపోవడం. గమనిక: బిడ్డ కదలికలు తగ్గినట్లు అనిపించినా లేదా ఉమ్మనీరు లీక్ అవుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.ఉమ్మనీరు తగ్గడానికి కారణాలు ఉమ్మనీరు తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి.
గర్భిణీ స్త్రీ శరీరంలో నీటి శాతం తగ్గడం. అధిక రక్తపోటు లేదా ప్రీ-ఎక్లాంప్సియా. మాయ (Placenta) సరిగ్గా పనిచేయకపోవడం (Placental Insufficiency). ప్రసవ సమయానికి ముందే ఉమ్మనీటి సంచి పగలడం (PROM). ప్రసవ తేదీ దాటిపోవడం (Post-term Pregnancy).
. దీనికోసం AFI (Amniotic Fluid Index) లేదా MVP (Maximum Vertical Pocket) అనే పద్ధతుల్ని ఉపయోగిస్తారు. దీంతో పాటు బిడ్డ ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.చికిత్స విధానం చికిత్స అనేది సమస్య తీవ్రత, గర్భధారణ నెలల్ని బట్టి ఉంటుంది: సాధారణ కేసుల్లో: గర్భిణీ ఎక్కువ నీరు తాగడం (Hydration), డాక్టర్ నిరంతర పర్యవేక్షణ ద్వారా ఉమ్మనీరు పెరుగుతుంది. తీవ్రమైన కేసుల్లో: తరచూ స్కానింగ్‌లు చేయడం, చెకప్‌లకు వెళ్లడం అవసరం. ఒకవేళ గర్భం కొనసాగించడం వల్ల బిడ్డకు ప్రమాదం అనుకుంటే, ప్రసవ సమయం దగ్గరపడినప్పుడు 'ఇండక్షన్' (నొప్పులు వచ్చేలా చేసి) ద్వారా డెలివరీ చేస్తారు. ఫలితం: ఉమ్మనీరు తగ్గడం వల్ల ఎదుగుదల లోపాలు, బొడ్డుతాడు నలిగిపోవడం లేదా నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం వంటి సమస్యలు రావచ్చు. కానీ, సరైన సమయంలో గుర్తిస్తే తగిన జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వొచ్చు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి: రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు (షుగర్ లేకుండా) తీసుకోవడం వల్ల ఉమ్మనీటి స్థాయి మెరుగవుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకోవడం: ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి, మాయకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది ఉమ్మనీరు పెరగడానికి పరోక్షంగా సాయపడుతుంది. విశ్రాంతి అవసరం: శారీరక శ్రమను తగ్గించి, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉమ్మనీటి స్థాయిలు మెరుగుపడతాయి. సొంత వైద్యం వద్దు: డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు (ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్) వాడకూడదు. కొన్ని మందులు ఉమ్మనీరు తగ్గడానికి కారణమవుతాయి.సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులుడాక్టర్ శారద ఎం సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి మరియు స్త్రీ వైద్య నిపుణురాలు, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.
బిడ్డ కిడ్నీలు లేదా మూత్రనాళాల్లో లోపాలు (గర్భధారణ సగం దాటిన తర్వాత బిడ్డ మూత్రమే ఉమ్మనీరుగా మారుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఉమ్మనీరు తగ్గిపోతుంది).వ్యాధి నిర్ధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఉమ్మనీటి శాతాన్ని కొలుస్తారు