
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్వీడన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా సోమవారం స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంచలన ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆట ప్రారంభమైన ఏడు నిమిషాలకే యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్‌కు ఆధిక్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆట 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఐసాక్ గోల్ కొట్టడంతో స్వీడన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెకిక్ ఆట 43వ నిమిషంలో గోల్ కొట్టడంతో ట్యునీషియా ఖాతా తెరిచింది.
అయితే రెండో హాఫ్‌లో పదే పదే ట్యునీషియా గోల్ పోస్టుపై స్వీడన్ దాడులు చేసింది. ఈ క్రమంలో విక్టోర్ (ఆట 59వ నిమిషం), మాట్టియస్ (ఆట 84వ నిమిషం)లో గోల్స్ కొట్టడంతో స్వీడన్ 4-1తో మరింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యాసిన్ అయారి మరో గోల్ కొట్టి స్వీడన్‌కు 5-1తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
సంబరాలకు దూరంగా యాసిన్ స్వీడన్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంబరాలకు దూరంగా ఉండిపోవడం వెనుక బలమైన కారణముంది. అదేంటంటే యాసిన్ అయారికి ట్యునీషియాతో మంచి సంబంధాలున్నాయి. యాసిన్ స్వీడన్ దేశస్తుడైనప్పటికీ అతడి తండ్రి మాత్రం ట్యునీషియాలోనే పుట్టి పెరిగాడు.
తండ్రికి చెందిన దేశంపై గెలిచినందునే తాను సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నట్లు యాసిన్ అయారి మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. 2023లో స్వీడన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన యాసిన్ అయారి అప్పటినుంచి జట్టు తరఫున సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ కీలక ఆటగాడిగా మారిపోయాడు.
చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు) ‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు) 'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
Jun 15 2026 12:22 PM | Updated on Jun 15 2026 12:36 PM
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్వీడన్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా సోమవారం స్వీడన్ 5-1 తేడాతో ట్యునీషియాతోను చిత్తు చేసింది. 22 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంచలన ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ప్రారంభమైన ఏడు నిమిషాలకే యాసిన్ అయారి గోల్ కొట్టి స్వీడన్‌కు ఆధిక్యం ఇచ్చాడు.
ఆ తర్వాత ఆట 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఐసాక్ గోల్ కొట్టడంతో స్వీడన్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ట్యునీషియా ఆటగాడు ఒమర్ రెకిక్ ఆట 43వ నిమిషంలో గోల్ కొట్టడంతో ట్యునీషియా ఖాతా తెరిచింది. అయితే రెండో హాఫ్‌లో పదే పదే ట్యునీషియా గోల్ పోస్టుపై స్వీడన్ దాడులు చేసింది.
ఈ క్రమంలో విక్టోర్ (ఆట 59వ నిమిషం), మాట్టియస్ (ఆట 84వ నిమిషం)లో గోల్స్ కొట్టడంతో స్వీడన్ 4-1తో మరింత ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా యాసిన్ అయారి మరో గోల్ కొట్టి స్వీడన్‌కు 5-1తో మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
సంబరాలకు దూరంగా యాసిన్ స్వీడన్ మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి సంబరాలకు దూరంగా ఉండిపోవడం వెనుక బలమైన కారణముంది. అదేంటంటే యాసిన్ అయారికి ట్యునీషియాతో మంచి సంబంధాలున్నాయి. యాసిన్ స్వీడన్ దేశస్తుడైనప్పటికీ అతడి తండ్రి మాత్రం ట్యునీషియాలోనే పుట్టి పెరిగాడు.
తండ్రికి చెందిన దేశంపై గెలిచినందునే తాను సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నట్లు యాసిన్ అయారి మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. 2023లో స్వీడన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన యాసిన్ అయారి అప్పటినుంచి జట్టు తరఫున సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ కీలక ఆటగాడిగా మారిపోయాడు.
చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ కైవసం చేసుకున్న విండీస్
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినీ నటికి లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పై నటి ఫిర్యాదు
చింతమనేని వీరంగం పై సంచలన నిజాలు బయటపెట్టిన ఈడ్పుగంటి శ్రీనివాస్ భార్య
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం.. అబ్బయ్య చౌదరి రియాక్షన్
అమెరికా, ఇరాన్ ఒప్పందం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో జోష్
254 బల్లులు తిన్న.. పోతానేమో అనుకొని రాత్రంతా పడుకోలేదు