
దిల్లీ: జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప ఏ ఆలోచనా లేదని పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై ఆయన దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. ఆనాడు ఏపీని విభజించిన తీరు నుంచి ఇవాళ్టికీ కాంగ్రెస్ ధోరణి మారలేదని విమర్శించారు. పార్టీ కంటే.. దేశ సమగ్రతకే ప్రాధాన్యం: పవన్
|