
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. చాలామంది చదువు పూర్తవగానే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరిపోకుండా ప్రభుత్వ పోటీ పరీక్షలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే ఒక మంచి అవకాశం కల్పించింది.
డిగ్రీలు, పీజీలు కాదు కేవలం పదో తరగతి పాసైతే చాలు, రైల్వేలో ఉద్యోగం సంపాదించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 6500కు పైగా ఖాళీ పోస్టుల భర్తీకి (Indian Railways Recruitment 2026) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రారంభంలోనే మంచి జీతం కూడా లభిస్తుంది… కాబట్టి గట్టిగా ట్రై చేస్తే లైఫ్ లో సెటిల్ కావచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 6,565 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ (Technician Grade 1 Signal) పోస్టుకు దరఖాస్తు చేయాలంటే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (B.Sc) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 (Technician Grade 3) పోస్టుకు పదో తరగతి పాసవడంతో పాటు, NCVT/SCVT గుర్తింపు పొందిన ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికెట్ తప్పనిసరి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) ద్వారా ఎంపికచేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన (Document Verification), వైద్య పరీక్ష (Medical Test) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అభ్యర్థులు అన్ని దశల్లోనూ అర్హత సాధించడం తప్పనిసరి… అయితేనే జాబ్ ఖాయం అవుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు ఎంపికైన వారికి, పే లెవల్ 5 ప్రకారం నెలకు రూ.29,200 ప్రారంభ జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు ఎంపికైతే, నెలకు రూ.19,900 ప్రారంభ జీతం లభిస్తుంది.
1 సిగ్నల్ పోస్టుకు 18 నుంచి 36 ఏళ్లు
టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టుకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 29. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోవడం మంచిది.
ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ప్రధాన వెబ్సైట్: (కేంద్ర రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్)
ఈ వెబ్సైట్లలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరగా దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
టెక్నీషియన్ గ్రేడ్