
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Weather update on Andhra Pradesh: బంగాళాఖాతంలో ద్రోణితో పాటు నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ,ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, నంద్యాల ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ప్రజలు ఈదురు గాలుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన ఈ సమయంలో చెట్ల కింద భారీ హోర్డింగల వద్ద నిలబడవద్దని సూచించింది. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు అయింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇక కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇకఆదివారం రోజు వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 3.3 సెం.మీ, శ్రీకాకుళం జిల్లా లావేరులో 3.2, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
వానలు.. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షం కాలనీలను ముంచెత్తింది. ఇక కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలో 10.06 సెంటీ మీటర్ల భారీ వర్షం పడింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కుండపోత వానకు రహదారులు పొంగిపోర్లాయి.
గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో 48 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సీజన్లో ప్రజలు వడగాలులతో అల్లాడిపోయారు. అలాంటి వారికి ఈ వర్షాల వల్ల వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాలతో వాగులు కాలువలు పొంగే పర్లే అవకాశం ఉందన్న లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు, ఈదురుగాలులతో పాటు రైతులు పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సమాచారాన్ని జారీ చేయడం జరిగింది.
ఈదురుగాలకు విద్యుత్ వైర్లు తెగిపోతాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండాలని చెప్పారు. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి పిడుగులతో కూడిన మోస్తర్ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. అంతేకాదు ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి పడిపోతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
కుండపోత