
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Heavy Rain Alert to Telangana: వాతావరణ శాఖ హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. మరోవైపు రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాల పడే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడం,జగిత్యాల, ఖమ్మం, మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
అటు మంచిర్యాల, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, వనపత్రి, కొమరంబీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు..
ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. మరో పక్క అటు తెలంగాణలోని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులు నేపథ్యంలో ప్రజలు చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సగం తెలంగాణలో ఎండల తీవ్రత ఉంటే
సగం తెలంగాణలో వర్షం కురుస్తోంది. ఎండలు మండే ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటు వంటి ఎండలు ఉండనున్నాయి. మరోవైపు సాయంత్రం సమయంలో కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉత్తర తెలంగాణతో పాటు ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 15 16 17 ఈ తేదీల్లో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించనున్నాయి. దీంతో తెలంగాన వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడనుంది.
ఈ యేడాది విపరీతమైనటువంటి ఎండల వల్ల చెరువులలో గాని కుంటల్లో గాని తగినంత నీరు లేదు. చాలా చోట్ల ఎండలకు ఇవి ఇంకిపోయాయి. ఎండల తీవ్రత కారణంగా ప్రధానంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. అటు ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి ఏ ప్రాజెక్టులలో నీళ్ళు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. పలు ప్రాజెక్టుల్లో ఎక్కువగా స్టోరేజీ లేదు కాబట్టి వర్షాల కురుడం వల్ల భూగర్భ జలాలతో పాటు ఆయా ప్రాజెక్టుల్లో నీళ్లు రావడం వల్ల సమీపంలోని భూగర్భ జలాలు రీఛార్జ్ కానున్నాయి. నదులు, చెరువులు నిండితేనే ఈసారి వ్యవసాయ రంగానికి తగినంత సాగునీరు అందే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్న మాట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.