
Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వర్షాల ఉధృతి పెరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
రాబోయే రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినప్పటికీ.. ఆ తర్వాత మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. Read also: Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణం చల్లబడింది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉండగా, మిగిలిన 23 జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది: Nellore Crime:నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ Bhatti Vikramarka: సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి Telangana Private School Fee : ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ
సర్కార్ ఫోకస్
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్
KTR Palamoor BRS Meeting :పాలమూరులో క్లీన్ స్వీప్!
Mahabubnagar National Lok Adalat: జూన్ 20న జాతీయ లోక్ అదాలత్!