
CBN Singapore Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు అక్కడి తెలుగువారు, ఎన్నారైలు (NRIs) పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.
సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన కొందరు చిన్నారులు తమ నృత్యాలతో చంద్రబాబును ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనకు ముగ్ధుడైన సీఎం, వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రవాసాంధ్రులందరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారితో సరదాగా ముచ్చటించి గ్రూప్ ఫొటోలు దిగారు.
చంద్రబాబు రాకతో సింగపూర్‌లోని తెలుగువారిలో పండగ వాతావరణం నెలకొంది. Read Also : కేశినేని బ్రదర్స్ మధ్య వార్.. చిన్ని కీలక వ్యాఖ్యలు ఒకవైపు సింగపూర్ పర్యటన ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, స్వరాష్ట్రంలో జరిగిన ఒక విషాద ఘటన సీఎం చంద్రబాబును తీవ్రంగా కలచివేసింది.
పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తెలుసుకున్న ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ, తక్షణమే స్పందించిన సీఎం..
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని (పరిహారం) ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. Today Rasi Phalalu : రాశి ఫలాలు – 15 జూన్ 2026 గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Vizianagaram Yogandhra: యోగాతో ఆరోగ్యం,ఐశ్వర్యం: మంత్రి కొండపల్లి MLA Amilineni Surendrababu:ఒక్క రక్తదానంతో మూడు ప్రాణాలు.. ఎమ్మెల్యే చేసిన సేవలు తెలుసా? Kishan Reddy at Srisailam:మల్లన్న సన్నిధిలో కేంద్ర మంత్రి!
: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు దుర్మరణం
Kesineni Brothers : కేశినేని బ్రదర్స్ మధ్య వార్.. చిన్ని కీలక వ్యాఖ్యలు Palnadu Boat Accident