
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్ (Iran) తో శాంతి ఒప్పందంలో అమెరికా (USA) టోల్ రహిత హర్మూజ్తోనే సర్దుకొన్నట్లు కనిపిస్తోంది. టెహ్రాన్‌తో ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రకటనలో హర్మూజ్ తెరుచుకొంటుందని ప్రకటించారు.
అక్కడ టోల్ కూడా వసూలు చేయరని ఆయన నొక్కిచెప్పారు. వాస్తవానికి ఇరాన్ అణ్వాయుధాల ఊసు మాత్రం ఈ ఒప్పందంలో లేకపోవడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ డీల్ విషయాన్ని ధ్రువీకరించిన తర్వాతే ఇరాన్ స్పందించింది.
ఐఆర్జీసీ దళాలకు అనుబంధంగా పనిచేసే ఐఆర్ఐబీ వార్తా సంస్థ తొలుత ఇరాన్ విజయంగా దీనిని అభివర్ణించింది. ఒప్పందానికి వచ్చే పరిస్థితి అమెరికాకు కల్పించినట్లు పేర్కొంది. ఆ తర్వాత సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది.
లెబనాన్ సహా ఇరాన్ మిత్రసంస్థలపై అమెరికా శాశ్వతంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేయడం, ఇరాన్ రేవులపై నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణమే తొలగించడం వంటి వాటికి అంగీకరించినట్లు పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందంపై జూన్ 19వ తేదీన సంతకాలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగశాఖ ఉప మంత్రి కాజెమ్ గరీబాబడీ వెల్లడించారు.
ఈ ఒప్పందం కోసం తుదివిడతగా 15 గంటలపాటు చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఇక తుది చర్చలు మాత్రం ఈ డీల్‌లోని అంశాలు అమలుపై ఆధారపడి ఉంటాయని ఇరాన్ చెబుతోంది. జూన్ 19న ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే హర్మూజ్ జలసంధి తెరుచుకొంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
చమురు రవాణ, సీమైన్స్ తొలగింపు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో దాదాపు 107 రోజులపాటు మూతపడిన హర్మూజ్ మళ్లీ తెరుచుకోనుంది. తాజాగా ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం రానున్న 50 ఏళ్లలో పశ్చిమాసియా మౌలిక స్వరూపాన్నే మార్చేస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు.
ఉన్న సెనెటర్ లిండ్సే గ్రాహం మాత్రం ఆచితూచి స్పందించారు. అమెరికా బృందం కంటే భిన్నంగా ఇరాన్ ఈ ఒప్పందాన్ని చూస్తుందని అభిప్రాయపడ్డారు. టెహ్రాన్ అణ్వాయుధాలను వదులుకోవడంపై సందేహాలను వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టెహ్రాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు సంపాదించలేదన్నారు. కాకపోతే శుక్రవారం జరగనున్న సంతకాల కార్యక్రమానికి ఎవరు వెళ్లాలన్న అంశంపై ట్రంప్ కార్యవర్గం ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడిగా