
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Venky Vs Chiru Movies: చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా కంటే ముందే ‘విశ్వంభర’ చిత్రాన్ని కంప్లీట్ చేశారు.
వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్‌లో ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాలోని గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
నాసిరకం గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మళ్లీ రీపేర్స్ చేయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాట. అయితే మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దసరా సీజన్ అయితే పిల్లలకు హాలీడే సీజన్ కాబట్టి క్యాష్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. మరోవైపు వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’ AK 47 సినిమా ముందుగా సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా షూటింగ్లో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగతావి ఆలస్యం కావడంతో మేకర్స్ ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.
త్రివిక్రమ్ ఇప్పటి వరకు యంగ్ స్టార్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించాడు. ఇప్పటి వరకు సీనియర్ స్టార్స్‌తో సినిమాలు తెరకెక్కించలేదు. రీసెంట్ టైమ్‌లో ప్యాన్ ఇండియా మార్కెట్‌ను ఓ ఊపు ఊపేస్తున్న దర్శకులు కూడా
సీనియర్ స్టార్స్‌తో సినిమాలు చేయడం లేదు. ఇలాంటి టైమ్‌లో త్రివిక్రమ్ వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో ఆయన ఇమేజ్‌కు తగ్గ కథతోనే ఫ్యామిలీ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు మాటల రచయతగా పనిచేసిన త్రివిక్రమ్.. ఇపుడు ఆయన్ని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
మరోవైపు ఈ దసరా బరిలోనే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే బాలయ్య బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో ముంబై మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే బాలయ్య ఓజీ అని చెప్పాలి.
ఇక 2027 సంక్రాంతి బరిలో ఇపుడే కర్ఛీఫ్‌లు వేసుకుంటున్నారు సీనియర్ హీరోలు. ఇప్పటికే చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా కూడా పొంగల్ పోటీలో విడుదల చేయాలనే ప్లాన్‌తో షూటింగ్‌ను చేస్తున్నారు. ఇక వెంకటేష్, కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాను కూడా వచ్చే యేడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. తొలిసారి వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనిల్ రావిపూడి తొలి సినిమా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో చాలా యేళ్ల తర్వాత అతనితో సినిమా చేస్తున్నాడు. ఇక వెంకటేష్‌తో ఎఫ్2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర్ వర ప్రసాద్ గారు తర్వాత వీళ్ల కలయికలో వస్తోన్న ఐదో సినిమా అని చెప్పాలి. హీరోగా వెంకీ, అనిల్ కాంబోలో నాల్గో చిత్రం. మొత్తంగా ఈ ఇద్దరు మిత్రులు రాబోయే రెండు పెద్ద పండగలను టార్గెట్ చేస్తూ బరిలో నిలవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాలు ఇపుడు చెబుతున్న టైమ్‌లో విడుదల అవుతాయో.. పోస్ట్ పోన్ అవుతాయా.. ? లేకపోతే పోస్ట్ పోన్ అవుతాయా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.