Crude Oil Price per Barrel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ప్రపంచం ఊపిరిపీల్చుకోనుంది. ఇరాన్‌తో అమెరికాకు శాంతి ఒప్పందం కుదిరినట్లు తాజాగా ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని, ఇక హార్ముజ్ జలసంధి కూడా ఎలాంటి సుంకాలు లేకుండా జూన్ 19న తెరుచుకుంటుందని అన్నారు.
ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేశారు. 'ప్రపంచంలోని నౌకలు.. ఇక మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి.' ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో తెలిపారు.
ఈ సందర్భంగానే శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా రోజులకు శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఇప్పటికే 2 రోజుల కిందట క్రూడాయిల్ ధర 3 నెలల కనిష్ఠానికి పడిపోగా..
ఇప్పుడు మరింత కిందికి దిగొచ్చింది. మార్చి నెల కనిష్ఠాలకు పడిపోవడం గమనార్హం. సోమవారం రోజు (జూన్ 15) డీల్ ప్రకటన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర మరో 4 శాతానికిపైగా తగ్గి బ్యారెల్‌కు 84 డాలర్ల దిగువకు చేరింది. ఇది మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
యుద్ధం ముందటి 70 డాలర్ల స్థాయికి కూడా పతనం కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే దేశీయంగా ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ దిగొచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.పాక్ ప్రధాని ట్వీట్..అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఉదయం ట్విట్టర్లో (x) పోస్ట్ చేశారు.
లెబనాన్ సహా అన్ని చోట్లా సైనిక చర్యల్ని తక్షణమే, శాశ్వతంగా ముగించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా డీల్‌పై సంతకాలు పూర్తవుతాయని అన్నారు. ఈ డీల్‌కు సంబంధించి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తుండగా..
సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ ప్రభుత్వాలకు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి 2 రోజుల ముందు కూడా షరీఫ్ ట్వీట్ చేశారు. 24 గంటల్లో అమెరికా- ఇరాన్ డీల్ ఉంటుందని తెలిపారు.అప్పటివరకు డౌటే..!అయితే ఇప్పుడు డీల్ కుదిరినట్లు తెలుస్తున్నా.. దీనిపై ఇరాన్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇటీవల కూడా ట్రంప్ వాదనలకు భిన్నంగా ఇరాన్ ప్రకటనలు చేసింది. కాబట్టి.. జూన్ 19న డీల్‌పై సంతకాలు జరిగేవరకు ఒప్పందం కుదిరిందా లేదా అన్నదానిపై స్పష్టత రాకపోవచ్చు. మళ్లీ ఈలోపు దాడులు జరిగితే పరిస్థితులు మళ్లీ క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఇటు డీల్‌పై ప్రకటన చేసిన ట్రంప్ మరోవైపు న్యూయార్క్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుంటే టెహ్రాన్‌పై మళ్లీ భీకర దాడులు చేస్తామని, అమెరికాను మిడిల్ ఈస్ట్‌కు రక్షకుడిగా మారుస్తానని హెచ్చరించారు.
సహకరించిన