
Mahabubnagar National Lok Adalat | మహబూబ్నగర్, జూన్ 14: న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు నిజమైన రాజమార్గం. ప్రజలకు త్వరితగతిన, అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే లక్ష్యంగా జూన్ 20న నిర్వహించనున్న ఈ ఏడాది రెండవ జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) ను జిల్లా ప్రజలు, కక్షిదారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి” అని మహబూబ్నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) డి.
జానకి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల సివిల్, క్రిమినల్ కేసులను పారదర్శకంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక చట్టబద్ధ కార్యక్రమ విజయవంతంపై ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఆమె కక్షిదారులకు పలు కీలక సూచనలు చేశారు.\ Read Also: CJP Protest : హైదరాబాద్ లో ‘కాక్రోచ్’ పార్టీ ఆందోళన..
జాతీయ లోక్ అదాలత్ ద్వారా లభించే చట్టపరమైన ప్రయోజనాలు, పరిష్కారమయ్యే కేసుల వివరాలను ఎస్పీ డి. జానకి ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని వివిధ న్యాయస్థానాలలో కేసులు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరూ ఈ అరుదైన అవకాశాన్ని విధిగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
లోక్ అదాలత్లో ఒకసారి రాజీ కుదిరిన తర్వాత ఇచ్చే తీర్పుకు సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన చట్టభద్రత ఉంటుందని, దీనిపై మళ్లీ ఎలాంటి అప్పీళ్లకు అవకాశం ఉండదని, తద్వారా వివాదానికి అక్కడితో శాశ్వత ముగింపు లభిస్తుందని పేర్కొన్నారు. రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకూ సమాన ప్రయోజనం కలుగుతుందని, అందువల్ల జూన్ 20న (శనివారం) జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల ప్రాంగణాలలో నిర్వహించే రెండవ జాతీయ లోక్ అదాలత్లో
కక్షిదారులు భారీ సంఖ్యలో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ డి. జానకి విజ్ఞప్తి చేశారు.
Kishan Reddy at Srisailam:మల్లన్న సన్నిధిలో కేంద్ర మంత్రి!
MLA Amilineni Surendrababu:ఒక్క రక్తదానంతో మూడు ప్రాణాలు.. ఎమ్మెల్యే చేసిన సేవలు తెలుసా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Mahabubnagar crime: చదువులో ఓటమి.. బలవన్మరణానికి పాల్పడిన ఇంటర్ విద్యార్థి!
Mahabubnagar POCSO Case:పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష!
Mahabubnagar news: పేదోడి నడ్డీ విరుస్తున్న బిజేపి
Medak Paddy Procurement:అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!
Laxma Reddy Slams Congress: మేము పాదయాత్ర ప్రకటించాకే..కాంగ్రెస్ లో చలనం!
Mahabubnagar Bike Stunts Arrest:మహబూబ్నగర్ బైక్ స్టంట్స్ అరెస్ట్!