
Zaheerabad | జహీరాబాద్, జూన్ 14 : హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ వయా జహీరాబాద్ (హైస్పీడ్ రైల్వే) వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావులను జహీరాబాద్ ప్రాంత ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు ఉజ్వల రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ మొదటి విడత డిఆర్పి అలైన్మెంట్లో జహీరాబాద్ మీదుగా వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారని రెండో విడత డీఆర్పీ అలైన్మెంట్లో కోకాపేట్, వికారాబాద్ మీదుగా వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించడంతో జహీరాబాద్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ఎంపీకి వివరించారు. జహీరాబాద్ కాకుండా వికారాబాద్ ప్రాంతం ఉందా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా డీఆర్పీ పొందుపరచడంతో తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతానికి అవరోధం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శాఖ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను పునః సమీక్షించి, డీపీఆర్‌లో తిరిగి జహీరాబాద్ మీదుగా వెళ్లేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రితోపాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ వంతు కృషితో జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల భాస్కర్, న్యాయవాది పాండు రంగా రెడ్డి, సుభాష్ రెడ్డి, విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు
తీస్తున్నారని నెటిజన్ల ఫైర్ Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Stand With Her | మహిళలకు మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యం.. స్టాండ్ విత్ హర్ ప్యానెల్ చర్చలో ప్యానెల్ సభ్యులు