
లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ దాడుల వల్ల ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి విఘాతం ఏర్పడవచ్చని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు (Trump on Beirut strike). బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
అయితే ఈ దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత దిగజార్చే చర్యలను నివారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని సూచించారు (Israel Beirut attack).
'ముప్పుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది (Donald Trump Israel). అయితే అది ప్రతిస్పందించిన దాడి చాలా చిన్నది, అర్థరహితమైనది. ఇరు పక్షాలూ తదుపరి సైనిక చర్యలకు దూరంగా ఉండాలి. ఇకపై లెబనాన్‌లో ఎక్కడా ఇజ్రాయెల్ దాడులు చేయకూడదు.
అలాగే హెజ్బొల్లాతో సహా మరే ఇతర పక్షం కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకూడదు. ఇది ఒక సుదీర్ఘమైన, సుందరమైన శాంతికి నాంది కావచ్చు. దీనిని మనం చేజార్చుకోవద్దు' అని ట్రంప్ పేర్కొన్నారు. ఐదేళ్లుగా విడాకుల కోసం పోరాటం.. చివరకు కోర్టులో న్యాయూమర్తి ఎదుట కౌగిలించుకుని..
మరింత ఎక్కువగా రష్యా చమురు.. మేలో గణనీయంగా పెరిగిన దిగుమతులు
..