ఉల్లిపాయల మీద ఉన్న నల్లటి మచ్చలు ఫంగస్ వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలు తేమతో కూడిన వాతావరణంలో ఉంటే ఈ మచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఇది 'బ్లాక్ ఫంగస్' ఇన్ఫెక్షన్ లాంటిదని అని అపోహ పడుతూ ఉంటారు. కానీ ఇది అంత ప్రమాదకారి కాదు.
ఈ నల్లటి మచ్చలు ఆస్పెర్గిల్లస్ నైజర్ అనే ఫంగస్ కారణంగా ఏర్పడతాయని IJCMAS అధ్యయనం పేర్కొంది. ఇది సాధారణ ఫంగస్ మాత్రమే. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న, గాలి ఎక్కువగా ప్రసరించకపోయినా, వెచ్చటి వాతావరణంలో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.
అయితే 'బ్లాక్-ఫంగస్' ఇన్ఫెక్షన్లకు దారితీసే మ్యూకోర్మైసెట్స్ వల్ల కలిగే పరిస్థితుల కంటే చాలా తక్కువ తీవ్రమైనవి. ఉల్లిపాయలపై ఈ నల్లటి చారలు తక్కువ పరిమాణంలో ఉంటే హానికరం కాదని నిపుణులు అంటున్నారు. వాటిని ఎక్కువ కాలం పాటు అధిక పరిమాణంలో తీసుకుంటే..
అవి ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది కిడ్నీలు, లివర్‌లో టాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి తక్కువ వేడిని కూడా తట్టుకుని బతకగలవు. అందుకే నల్లటి చారలు ఉన్న ఉల్లిపాయలను వంటలో వాడే ముందు శుభ్రంగా కడగటం చాలా ముఖ్యం.
ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు కేవలం పై పొర పైనే ఉండి, లోపల పొరలు గట్టిగా, తెల్లగా ఉంటే.. ప్రభావిత భాగాన్ని తొలగించి.. మిగిలింది వాడుకోవచ్చు. ఒకవేళ అది లోపలి వరకు వెళ్లినా, ఉల్లిపాయ మెత్తబడినా అది పారేయడమే మంచిది. వాటిలో మైకోటాక్సిన్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఉంటే కొందరు వాటిని తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, లివర్ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగానే ఉంటే మంచిదని అంటున్నారు.
అరోగ్యవంతులు కూడా వీటిని తక్కువగా వాడితేనే మంచిది. ఉల్లిపాయలు స్టోర్ చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే
బ్లాక్ పంగస్ అభివృద్ధి కాదని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలను గాలి చొరబడే బుట్టల్లో, పేపర్ బ్యాగుల్లో లేదా వల సంచుల్లో నిల్వ ఉంచాలి. ప్లాస్టిక్ సంచుల్లో ఉంచితే గాలి చొరబడదు. దీని వల్ల ఉల్లిపాయలపై ఫంగస్ ఏర్పడుతుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు తెలియజేసిన అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి