
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు..
ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు.. ఇలా అభిమానులు కౌంట్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్క గోల్‌తోనే మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలున్నాయి. అసలు గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు కోకొల్లలు. ఇక 1930లో ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,700 గోల్స్ చేయడం విశేషం.
అయితే ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ నమోదు అయిన మ్యాచ్‌లు అరుదుగా ఉంటాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 12 గోల్స్ నమోదు కావడం ఇప్పటికీ రికార్డుగా ఉంది. 1954లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
అంతేకాదు ఫిఫా చరిత్రలో 71 ఏళ్లుగా ఈ రికార్డు ఇప్పటికీ చెక్కెచెదరలేదు. మూడు సందర్భాల్లో ఈ రికార్డుకు చేరువలోకి వచ్చినప్పటికీ 12 గోల్స్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. 1954 ఫిఫా ప్రపంచకప్: ఆస్ట్రియా వర్సెస్ స్విట్జర్లాండ్ 👉ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లు తలపడ్డాయి.
జూన్ 26న జరిగిన మ్యాచ్‌లో మొదటి 23 నిమిషాల్లో స్విట్జర్లాండ్ మూడు గోల్స్ కొట్టగా, తర్వాతి 25 నిమిషాల్లో ఆస్ట్రియా 5 గోల్స్ కొట్టడం విశేషం. మొదటి హాఫ్ ముగిసేసరికే ఇరుజట్లు కలిపి 9 గోల్స్ కొట్టడం విశేషం. ఆ తర్వాతి హాఫ్ టైమ్‌లో మరో మూడుగోల్స్ నమోదయ్యాయి.
ఇందులో ఆస్ట్రియా రెండు, స్విట్జర్లాండ్ ఒకటి ఉన్నాయి. అంతిమంగా 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఆస్ట్రియా 7-5తో స్విట్జర్లాండ్‌పై విజయాన్ని అందుకుంది. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ నమోదయిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది.
Jun 14 2026 6:59 PM | Updated on Jun 14 2026 7:15 PM
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు.. ఇలా అభిమానులు కౌంట్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక్క గోల్‌తోనే మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలున్నాయి.
అసలు గోల్ నమోదు కాకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు కోకొల్లలు. ఇక 1930లో ఫిఫా ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,700 గోల్స్ చేయడం విశేషం. అయితే ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ నమోదు అయిన మ్యాచ్‌లు అరుదుగా ఉంటాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 12 గోల్స్ నమోదు కావడం ఇప్పటికీ రికార్డుగా ఉంది.
1954లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అంతేకాదు ఫిఫా చరిత్రలో 71 ఏళ్లుగా ఈ రికార్డు ఇప్పటికీ చెక్కెచెదరలేదు. మూడు సందర్భాల్లో ఈ రికార్డుకు చేరువలోకి వచ్చినప్పటికీ 12 గోల్స్ రికార్డును మాత్రం అందుకోలేకపోయాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
1954 ఫిఫా ప్రపంచకప్: ఆస్ట్రియా వర్సెస్ స్విట్జర్లాండ్ 👉ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లు తలపడ్డాయి. జూన్ 26న జరిగిన మ్యాచ్‌లో మొదటి 23 నిమిషాల్లో స్విట్జర్లాండ్ మూడు గోల్స్ కొట్టగా, తర్వాతి 25 నిమిషాల్లో ఆస్ట్రియా 5 గోల్స్ కొట్టడం విశేషం. మొదటి హాఫ్ ముగిసేసరికే ఇరుజట్లు కలిపి 9 గోల్స్ కొట్టడం విశేషం. ఆ తర్వాతి హాఫ్ టైమ్‌లో మరో మూడుగోల్స్ నమోదయ్యాయి.
ఇందులో ఆస్ట్రియా రెండు, స్విట్జర్లాండ్ ఒకటి ఉన్నాయి. అంతిమంగా 90 నిమిషాల ఆట ముగిసేసరికి ఆస్ట్రియా 7-5తో స్విట్జర్లాండ్‌పై విజయాన్ని అందుకుంది. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ నమోదయిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. అంతేకాదు ఈ రికార్డు ఏడు దశాబ్దాలుగా చెక్కుచెదరలేదు.
1982 ఫిఫా ప్రపంచకప్: హంగేరి వర్సెస్ సాల్వడార్ 👉హంగేరి, సాల్వడార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. అయితే ఇందులో హంగేరి 10 గోల్స్ కొడితే, సాల్వడార్ ఒక గోల్‌కే పరిమితమైంది. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో బిగ్ మార్జిన్ (9 గోల్స్ తేడాతో) తో విజయం సాధించిన మ్యాచ్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో హంగేరి నుంచి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన లాజ్లో కిస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవడం విశేషం. ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఫిఫా చరిత్రలో అదే తొలిసారి.
1938 ఫిఫా ప్రపంచకప్: బ్రెజిల్ వర్సెస్ పోలండ్ 👉1938 ఫిఫా వరల్డ్‌కప్‌లో పోలండ్, బ్రెజిల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. ఇందులో బ్రెజిల్ ఆరు గోల్స్ కొడితే, పోలండ్ ఐదు గోల్స్ కొట్టింది. నెక్ టూ నెక్ జరిగిన పోరులో బ్రెజిల్ ఒక్క గోల్ తేడాతో విజయం సాధించింది. అయితే పోలండ్ కొట్టిన ఐదు గోల్స్‌లో నాలుగు గోల్స్ ఎర్నెస్ట్ విల్లిమోస్కీవే కావడం విశేషం.
👉1954 ఫిఫా ప్రపంచకప్‌లోనే హంగేరి, వెస్ట్ జర్మనీ మధ్య మ్యాచ్‌లో 11 గోల్స్ నమోదయ్యాయి. ఇదే ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, పరాగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో 10 గోల్స్ నమోదయ్యాయి. ఇదే ప్రపంచకప్‌లో 26 మ్యాచ్‌ల్లో 140 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది.
👉ఇక 1938 నుంచి 1982 వరకు జరిగిన ఫిఫా ప్రపంచకప్పుల్లో ప్రతీ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం 10 గోల్స్ చేసిన దాఖలాలున్నాయి. అయితే నాలుగు దశాబ్దాలుగా మళ్లీ ఆ ఫీట్ నమోదవ్వకపోవడం గమనార్హం.
చదవండి: పాక్‌తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన
బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం
అంతేకాదు ఈ రికార్డు ఏడు దశాబ్దాలుగా చెక్కుచెదరలేదు. 1982 ఫిఫా ప్రపంచకప్: హంగేరి వర్సెస్