
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2026లో ఖతార్ ఒక్క పాయింట్‌తో ఖాతా తెరిచింది. ఇందులో సంచలనం ఏముంది? అంటారా.. విదేశీ గడ్డపై వరల్డ్ కప్‌లో ఖాతా తెరవడం ఖతార్కిదే మొదటిసారి. దీని వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ తన జట్టు కోసం తాపత్రయపడ్డారు.
ఆయన పేరు జులెన్ లోపెటెగుయి.. ఓ వైపు బాంబుల వర్షం.. అక్కడి ప్రజలంటే ఎటూ పోలేని పరిస్థితి. ఇక విదేశీయులంతా వెంటనే ఖాళీ చేసేసి తమ స్వదేశానికి వెళ్లిపోతారు. కానీ, జులెన్ మాత్రం రానని తెగేసి చెప్పేశాడు. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా కుదరదన్నాడు.
ఇప్పుడు అతడు ఆ దేశ ప్రజలకు హీరోగా మారిపోయాడు. ఫిఫా ప్రపంచ కప్‌లో ఖతార్ తొలిసారి విదేశీ గడ్డపై పాయింట్ సాధించడంలో మేనేజర్‌గా అతడిదీ కీలక పాత్రే. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను ఖతార్ 1-1తో సమం చేసుకుంది. అది 2018 ఫిఫా వరల్డ్ కప్‌నకు కొద్ది రోజుల ముందు..
స్పెయిన్ మేనేజ్మెంట్ జులెన్ను తప్పించింది. దానికి కారణం రియల్ మాడ్రిడ్‌కు అంగీకరించడమే. ఆ తర్వాత ఖతార్‌కు మేనేజర్‌గా మారాడు. గత వరల్డ్ కప్‌నకు ఖతార్ ఆతిథ్య దేశం. అప్పుడు నేరుగా అర్హత సాధించింది. కానీ, ఈసారి మాత్రం ప్రపంచ కప్‌లో ఆడాలంటే క్వాలిఫయర్స్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
ఆ అడ్డంకిని దాటుకొని ఇప్పుడీ మెగా టోర్నీలో అడుగు పెట్టింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుని అదరగొట్టింది. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఖతార్‌లోనూ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ కప్ కోసం ఆ జట్టు సన్నద్ధత కూడా అనుకున్నంత సాఫీగా సాగలేదు.
అర్జెంటీనా, సెర్బియాతో మ్యాచులూ రద్దయ్యాయి. మరోవైపు జులెన్ లోపెటెగుయిని స్వదేశానికి వచ్చేయమని కుటుంబ సభ్యులు అడగడం మొదలుపెట్టారు. కానీ, అతడు మాత్రం జట్టుతోపాటు ఉండేందుకే మొగ్గు చూపాడు. ఆనాటి విషయాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు.
అనుభవించలేదు. ఓ వైపు హెచ్చరికలు వస్తుంటాయి. ఎప్పుడు ఏం అలర్ట్ వస్తుందా? అని ఫోన్‌కు అతుక్కుని పోయి ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సందేశాలు వస్తాయి. ప్రమాద తీవ్రత తగ్గినప్పుడు మరొకటి వస్తుంది. సురక్షిత ప్రాంతాల్లో.. ఇంట్లో, గాజు వస్తువులకు దూరంగా ఉండమని చెబుతుంటారు. చాలా బాంబులు అమెరికా స్థావరాలు ఉన్న చోట పడ్డాయి. ఆ స్థావరాలకు దూరంగా ఉంటే సురక్షితంగా ఉన్నట్లు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబం ‘తిరిగి వచ్చేయండి’ అని చెబుతూ ఉంటుంది. కానీ, అక్కడ నుంచి రాలేరు. దాదాపు రెండు వారాలు గగనతలం మూసివేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లడం సరైనదిగా అనిపించలేదు. విమాన ప్రయాణాలు మొదలైనప్పుడు నా భార్యను పంపించి నేను మాత్రం ఉండిపోయా. నేను చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. నేనేదో హీరో అవుదామని కాదు. అది నా కర్తవ్యం అనుకున్నా’’ అని జులెన్ లోపెటెగుయి తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
‘‘అది చాలా దారుణమైన అనుభవం. అంతకుముందు ఎన్నడూ