
Hanamkonda: సమాజంలో శాంతిభద్రతలను కాపాడి, బాధితులకు అండగా నిలవాల్సిన ఒక పోలీస్ అధికారి బేధ్యతారహితంగా ప్రవర్తించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితను పెళ్లి పేరుతో నమ్మించి, ఆమె కాపురాన్ని కూల్చి, శారీరకంగా లొంగదీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ అరాచకానికి ఒడిగట్టిన హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండకు చెందిన ఒక యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న రోజుల్లో ఒక యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కొన్నాళ్ల తర్వాత దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో.. సదరు మహిళ 2022 మార్చిలో తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్ కుమార్ బాధితురాలికి పరిచయమయ్యాడు. నీకు న్యాయం చేస్తానని నమ్మబలికిన ఎస్ఐ, ఆమెను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. తనకు తెలిసిన లాయర్‌తో మాట్లాడించి, ఆమె భర్త నుండి చట్టబద్ధంగా విడాకులు ఇప్పించాడు. Read also: AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా భర్త నుండి విడిపోయిన తర్వాత ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని ఎస్ఐ రాజ్‌కుమార్ నమ్మించాడు. ఆ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సదరు మహిళ రెండు సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా అబార్షన్ చేయించాడు. రోజులు గడుస్తున్నా పెళ్లి ప్రస్తావన ఎత్తకపోవడంతో బాధితురాలు నిలదీసింది. దీంతో ఎస్ఐ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. గతంలో రహస్యంగా రికార్డ్ చేసిన ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా, ఆమె ఉద్యోగం చేసే ఆఫీస్‌కు ఫోన్ చేసి వేధించడమే కాకుండా, ఆమె మొబైల్ నంబర్ మరియు లొకేషన్‌ను అక్రమంగా ట్రాక్ చేస్తూ నిఘా పెట్టాడు. అనుమానంతో మానసిక వేధింపులకు గురిచేస్తూ
.. బలవంతంగా పలు హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడిని కొనసాగించాడు. ఈ నెల మొదటి వారంలో కూడా హనుమకొండలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి.. ‘జీవితాంతం నాతోనే శారీరక సంబంధం కొనసాగించాలి, లేదంటే నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి జీవితాన్ని నాశనం చేస్తా’ అని హెచ్చరించాడు.
ఎస్ఐ చేస్తున్న ఈ దారుణాలను భరించలేకపోయిన బాధితురాలు.. రెండు రోజుల క్రితం నేరుగా హైదరాబాద్‌లో ఐజీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు శనివారం వరంగల్ భరోసా సెంటర్లో మహిళా అధికారులు బాధితురాలి నుండి సమగ్రమైన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
అనంతరం ఈ కేసును తదుపరి చర్యల నిమిత్తం హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ఐ రాజ్‌కుమార్‌పై అత్యాచారం (లైంగిక దాడి), ప్రాణభీతి కలిగించడం, చీటింగ్, ఐటీ చట్టాల (IT Act) కింద కేసులు నమోదు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ వెల్లడించారు. నిందితుడైన ఎస్ఐపై శాఖాపరమైన కఠిన చర్యలకు కూడా ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
Nara Lokesh: అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
Earthquake : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం
Breakfast Scheme : రేపటి నుంచి ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
Paddy Procurement : ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్
CJP Protest in Hyderabad : రేపు హైదరాబాద్‌లో ‘కాక్రోచ్’ నిరసన కు పోలీసుల అనుమతి
Heavy Rain : భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు