
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసోజు శ్రవణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వచ్చే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు?